Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్ : బాల్ టాంపరింగ్ నిషేధం నుంచి తిరిగొచ్చిన డెవిడ్ వార్నర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్13 సీజన్ నాయకత్వ పగ్గాలు అప్పగించింది. గత తప్పిదాలను సరిచేసుకునే దిశగా దీన్ని చూడటం లేదని వార్నర్ అన్నాడు. ' ఇదేమీ పాప ప్రక్షాళన క్రమం కాదు. సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తాను. ఆటగాళ్లతో, సిబ్బందితో, యాజమాన్యంతో గొప్ప సంబంధాలు ఉన్నాయి. సన్‌రైజర్స్‌కు మరో టైటిల్ అందించేందుకు వంద శాతం ప్రయత్నిస్తాను. గత సీజన్లో సైతం నేను సారథిగానే భావించుకున్నాను. నాయకుడిగా ఉండేందుకు కెప్టెన్సీ ట్యాగ్ ఉండక్కర్లేదు. మన పంథాలో జట్టును ముందుండి నడిపించవచ్చు' అని వార్నర్ అన్నాడు.