Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ సూచనలు
ముంబయి : దేశవాళీ క్రికెట్ పున ప్రారంభం, రాష్ట్ర స్థాయిలో క్రికెట్ సీజన్ మొదలు పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ 100 పేజీలతో కూడిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సోమవారం బీసీసీఐ సూచనలు చేసింది. రాష్ట్ర జట్టు సహాయక సిబ్బందిలో 60 ఏండ్లకు పైబడిన వారిని తీసుకోవద్దని బోర్డు సూచించింది. ఈ నిబంధనతో బెంగాల్ కోచ్ అరుణ్ లాల్, బరోడా కోచ్ డేవ్ వాట్మోర్లు ఈ సీజన్‌కు దూరం కానున్నారు. స్థానిక ప్రభుత్వాల నిబంధనలకు లోబడి క్రికెట్ క్యాంప్‌లను నిర్వహించాలి. క్యాంప్‌కు హాజరు కావాలనుకున్న క్రికెటర్లు మూడు రోజుల్లో రెండు సార్లు కోవిడ్19 పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టుతో రాష్ట్ర సంఘాన్ని సంప్రదించాలి. క్యాంప్ సమయంలో, మ్యాచుల సమయంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను నియమించాలని బోర్డు సూచించింది. క్రికెటర్లు వ్యక్తిగత వాహనాల్లోనే మైదానాలకు రావాలని బీసీసీఐ తెలిపింది.