Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు క్రికెట్ ప్రపంచానికి సుపరి చితమే. తన వైవిధ్యమైన ఆటతీరుతో.. కూల్ కెప్టె న్సీతో ఎంతోమంది అబి మానులను సొంతం చేసుకున్నాడు. భారత్ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలను అందించాడు. ధోనిని అభిమానులు మాత్రమే కాదు.. ఎంతోమంది మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు ఇష్టపడతారు. వికెట్ల వెనుక కూల్‌గా ఉంటూ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును విజయతీరాలకు చేర్చడంలో ధోనిది అందవేసిన చెయ్యి. ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. క్రికెట్లో ఎంతోమంది అద్భుతమైన కీపర్లు ఉన్నా తన ఓటు మాత్రం ధోనీకేనని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ''ప్రపంచంలో ఉత్తమ కీపర్ ఎవరంటే నేను ధోనినే ఎంచుకుంటా. నా దష్టిలో ధోని అగ్రస్థానంలో ఉంటాడు. అతడి స్టైల్ అభిమానుల అంచనాలను అందుకుంటూ అతడు ఆడే విధానం ఎంతో ప్రత్యేకం. ఇక ధోని తర్వాత స్థానాల్లో సంగక్కర, మెక్‌కలమ్, బౌచర్‌లు ఉంటారు. కాగా, భారత క్రికెట్‌పై ధోని ప్రభావం ఎంతోకాలం ఉంటుంది'' అని గిల్లి వివరించాడు.