Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టెస్టులో పాక్‌పై ఘన విజయం
- జోశ్ బట్లర్, క్రిస్ వోక్స్ మెరుపులు
మాంచెస్టర్ (ఇంగ్లాండ్)
టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ అద్భుతాలు కొనసాగుతు న్నాయి. ఆశల్లేని స్థితి నుంచి అద్భుత విజయం వరకు గెలుపు ప్రస్థానం సాగుతూనే ఉంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్ రెండో టెస్టును, స్టువర్ట్ బ్రాడ్ మూడో టెస్టును గెలిపించగా.. పాకిస్థాన్‌తో సిరీస్ ఆరంభ టెస్టులో మరో ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ఆతిథ్య జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాకిస్థాన్ పేస్ దళం, స్పిన్ మాంత్రికుడు యాషిర్ షా విజృంభిస్తున్న వేళ 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓ దశలో 117/5తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. కానీ ఆఖరు క్షణాల్లో అద్భుతాన్ని మరోసారి పునరావృతం చేసింది. టెస్టు జట్టు నుంచి వేటు ప్రమాదం ఎదుర్కొంటున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోశ్ బట్లర్ (75, 101 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), పేస్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ (84 నాటౌట్, 120 బంతుల్లో 10 ఫోర్లు)లు ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. అర్థ సెంచరీలతో చెలరేగిన బట్లర్, వోక్స్ ఇంగ్లాండ్‌ను విజయ తీరాలకు చేర్చారు. తొలి టెస్టులో తొలి మూడు రోజులూ ఆధిపత్యం చెలాయించిన పాకిస్థాన్ నాల్గో రోజు ఆటలో తడబడి, పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. క్రిస్ వోక్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. సిరీస్‌లో రెండో టెస్టు గురువారం (ఆగస్టు 13) నుంచి సౌతాంప్టన్‌లో ఆరంభం కానుంది.
సంక్షిప్త స్కోర్లు :
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 326/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 219 /10
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ : 169/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 277/7