Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో న్యూజిలాండ్‌కు పయనం
మాంచెస్టర్: ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్, ఆ జట్టు వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. మాంచెస్టర్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ ఆఖర్లో అద్భుతంగా రాణించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిరుడు దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు సమయంలో బెన్ స్టోక్స్ తండ్రి ఆసుపత్రి పాలయ్యాడు. బెన్ స్టోక్స్ తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లో నివస్తున్నారు. ప్రస్తుతం స్టోక్స్ తండ్రి ఆరోగ్యం నిలకడగా లేదని తెలుస్తోంది. అందుకే పాకిస్థాన్‌తో చివరి రెండు టెస్టులకు కుటుంబ కారణాల రీత్యా బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో స్టోక్స్ వ్యక్తిగత, కుటుంబ జీవిత ప్రైవసీని గౌరవించాలని ఈసీబీ కోరింది. బెన్ స్టోక్స్ దూరం కావటంతో తర్వాతి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ తుది జట్టు ఎంపిక క్లిష్టతరం కానుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులో గాయపడిన స్టోక్స్ ఆ సిరీస్‌లో మూడో టెస్టులో బౌలింగ్ చేయలేదు. పాక్‌తో తొలి టెస్టులో నం.4 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఆడినా.. పెద్దగా రాణించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో బంతితో 2/11తో మెరిశాడు. స్టోక్స్ దూరం కావటంతో ససెక్స్ పేసర్ ఒలీ రాబిన్సన్కు ఈసీబీ పిలుపు అందింది. సౌతాంప్టన్‌లో టెస్టు జట్టుతో రాబిన్సన్ చేరనున్నాడు.