Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాలో భారత్ బాక్సర్ శిక్షణకు సారు అనుమతి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్న భారత బాక్సర్ వికాశ్ కృష్ణ అమెరికాలో శిక్షణకు సారు అనుమతించింది. నవంబర్ 30 వరకు శిక్షణపొందటానికి వికాశ్‌కు 17.5లక్షలు మంజూరుచేసింది. 69 కిలోల కేటగిరిలో రాష్ట్రక్రీడల్లో స్వర్ణపతకాన్ని వికాశ్ దక్కించుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించుకున్న వికాశ్ ఒలింపిక్స్ క్రీడల్లో రాణించాలంటే మరింత శిక్షణ అవసరమని సారు తెలిపింది. దీనికి అవసరమైన శిక్షణ కోసం అమెరికా పంపటానికి అనుమతించినట్టు సారు పేర్కొంది. ఒలింపిక్స్ పొడియమ్ కార్యక్రమం(టాప్స్)లో వికాశ్ సత్తా చాటతాడనే నమ్మకం ఉన్నదని వివరించింది. వచ్చేవారంలో అమెరికా aకచ్ రాన్ సిమన్స్ జూనియర్‌తో అమెరికాకు వెళ్లి నవంబర్ 30 వరకు వర్జీనియాలోని అలెక్సాండ్రియా బాక్సింగ్ క్లబ్లో శిక్షణ పొందనున్నట్టు సారు వెల్లడించింది.