Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: చెన్నై సూపర్‌కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ కరోనా నుంచి కోలుకొని ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుక్రవారం కరోనానుంచి బయటపడినట్టు క్లియరెన్స్ ఇవ్వడంతో శుక్రవారం నెట్స్‌లో చాహర్ బౌలింగ్ సాధన చేశాడు. చాహర్‌కు కరోనా సోకడంతో జట్టు సభ్యులతో ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు. బుధవారం జరిపిన రెండోసారి పరీక్షల్లో కరోనా నెగెటివ్ తేలడం, బయో బబుల్ నిబంధనలు పూర్తవ్వడంతో బహిరంగ ప్రాక్టీస్‌కు హాజరయ్యాడు. చాహర్ కోలుకోవడంతో తమ ఫ్రాంచైజీకి కలిసొచ్చే అంశమని చెన్నై సీఈవో విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే సురేష్ రైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు డేవిడ్ మలన్‌ను చెన్నై ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.
నైట్‌రైడర్స్‌కు ఆడనున్న మోర్గాన్, కమ్మిన్స్
కోల్‌కతా నైట్ రైడర్స్‌కూ ఊరట లభించింది. ఇంగాండ్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ అనంతరం మోర్గాన్, పాట్ కమ్మిన్స్ ఐపీఎల్లో ఆడేందుకు దుబారుకు బయల్దేరి రానున్నారు. ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం వీరిద్దరితోపాటు టామ్ బంటన్ కూడా అబుదాబిలో జట్టుతో కలుస్తాడని చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్ శుక్రవారం తెలిపాడు.