Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్లను సరిచేసుకొనే పనిలో పడ్డాడు. ఈనెల 21న ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇదిలా ఉండగా శుక్రవారం విరాట్ కోహ్లీ ట్విట్టర్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో విరాట్ తన బ్యాట్ హ్యాండిల్‌ను రంపంతో కోస్తూ మరమ్మతులు చేస్తూ కనిపించాడు. ''బ్యాట్ సమతుల్యతకు నాకు రెండు సెంటీమీటర్లు కూడా చాలా ముఖ్యమైనది. నా బ్యాట్లను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం'' అని కోహ్లీ ట్విట్టర్లో తన పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టాడు.