Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థామస్, ఉబర్ కప్‌లకు దూరం
న్యూఢిల్లీ : మెన్స్ థామస్ కప్ 13 సార్లు గెల్చుకున్న తిరుగులేని రికార్డు కలిగిన ఇండోనేషియా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ సమాఖ్య నిర్వహిస్తున్న థామస్, ఉబర్ కప్ ఫైనల్స్ నుంచి వైదొలిగింది. కరోనా మహమ్మారి ప్రమాదకర పరిస్థితుల్లో తమ క్రీడాకారులను సురక్షితం కాని టోర్నీలకు పంపలేమని ఇండోనేషియా బ్యాడ్మింటన్ సంఘం శనివారం ప్రకటించింది. ఇండోనేషియా దారిలోనే దక్షిణ కొరియా నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్‌లో అక్టోబర్ తొలి వారంలో ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్‌లో పాల్గొనటం లేదని ప్రకటించింది. ఇండోనేషియా ఉబర్ కప్‌ను సైతం మూడుసార్లు గెల్చుకుంది. ఆస్ట్రేలియా, తైవాన్లు సైతం కరోనా కారణంగా థామస్, ఉబర్ కప్‌ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక డెన్మార్క్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్ టోర్నీలో సైతం ఇండోనేషియా షట్లరు పాల్గోనబోరని ఆ దేశ బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది.