Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఆస్ట్రేలియా సిరీస్
ఆడిలైడ్ : ఆడిలైడ్ ఓవల్ స్టేడియం ఆవరణలో నూతనంగా నిర్మించిన అధునాతన స్టార్ హౌటల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా క్వారంటైన్ కేంద్రంగా వాడుకోనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. టీ20, వన్డే సిరీస్ అనంతరం ఇంగ్లాండ్ నుంచి తిరిగి రానున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడిలైడ్ ఓవల్‌లో క్వారంటైన్ పూర్తి చేసుకుని.. అక్కడే రానున్న భారత్ సిరీస్‌కు సన్నద్ధం అవుతారని తెలిపింది. ఐపీఎల్ కాంట్రాక్టులు కలిగిన క్రికెటర్లు నేరుగా యుఏఈకి వెళ్లనుండగా, ఇతరులు నేరుగా ఆడిలైడ్‌కు చేరుకోనున్నారు. టీమ్ ఇండియాతో బయో సెక్యూర్ బబుల్ సిరీస్‌కు ఆడిలైడ్ ఓవల్ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. భారత జట్టు క్వారంటైన్ కుదింపు సహా ఇతర అంశాలపై స్పష్టత కోసం సీఏ పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. భారత జట్టు 14 రోజుల క్వారంటైన్‌ను ఏడు రోజులకు కుదించేందుకు సీఏ ప్రయత్నాలు చేస్త్తున్నట్టు సమాచారం.