Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎస్ ఓపెన్ అనర్హతపై జకోవిచ్
మిలాన్ (ఇటలీ) : వరల్డ్ నం.1 నొవాక్ జకోవిచ్‌పై యుఎస్ ఓపెన్ నిర్వాహకులు అనర్హత వేటు సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు పాబ్లోతో తొలి సెట్లో సర్వ్ గేమ్‌ను కోల్పో యిన జకోవిచ్ అసహనంతో బంతిని లైన్ఉమెన్పైకి అనుకోకుండా కొట్టాడు. లైన్ఉమెన్ గొంతుకు బంతి బలంగా తగటంతో ఆమె నేలపై పడిపోయింది. నిబంధనల ప్రకారం జకోవిచ్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. దక్కాల్సిన ప్రైజ్‌మనీతో పాటు అదనంగా మరో 10,000 అమెరికన్ డాలర్లు జరిమానా విధించారు. రావాల్సిన ర్యాంకింగ్స్ పాయింట్లను వెనక్కి తీసుకున్నారు. అనర్హత వేటు లేకుంటే, జకోవిచ్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరివుండేదే!. ఆ సంఘటనపై జకోవిచ్ స్పందించాడు. ' మళ్లీ అటువంటి సంఘటన జరుగదని హామీ కానీ గ్యారెంటీ కానీ ఇవ్వలేను. కానీ పునరావృతం కాకుండా నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిబంధనల ప్రకారం నిర్వాహకులు నిర్ణయం తీసుకు న్నారు. నేను అంగీకరించి, ముందుకు సాగుతున్నాను' అని జకోవిచ్ అన్నాడు.