Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం
న్యూఢిల్లీ : ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బదిలీగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్న అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ.. బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ అంగీకారం తెలపకపోవటంతో ఈ సీజన్‌కు బదిలీ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. బార్సిలోనా క్లబ్ వీడకపోయినా, 2020 ఏడాదిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన సాకర్ స్టార్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు మెస్సీ. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మెస్సీ 126 మిలియన్ అమెరికన్ డాలర్లతో అర్జెంటీనా స్టార్ నం.1గా నిలువగా.. పోర్చుగల్ హీరో, సోషల్ మీడియా ద్వారా కండ్లుచెదిరే మొత్తాన్ని ఆర్జిస్తున్న క్రిస్టియానో రొనాల్డో 117 మిలియన్ అమెరికన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్ సూపర్‌స్టార్ నెరుమార్ జూనియర్ 96 మిలియన్ అమెరికన్ డాలర్లు, కలియన్ ఎంబపె 42 మిలియన్ అమెరికన్ డాలర్లు, మహ్మద్ సాలా 37 మిలియన్ అమెరికన్ డాలర్లతో టాప్-5లో నిలిచారు. ఒక బిలియన్ డాలర్ల క్లబ్లో (ఏడు వేల కోట్లు) చేరిన రెండో సాకర్ స్టార్‌గా మెస్సీ రికార్డు నెలకొల్పాడు. క్రిస్టియానో రొనాల్డో బిలియన్ డాలర్ల క్లబ్లో అడుగుపెట్టిన తొలి సాకర్ స్టార్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.