Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంబయి ఇండియన్స్ 162/9
- మెరిసిన చావ్లా, దీపక్, ఎంగిడి
అబుదాబి : దిగ్గజాల సమరం మరోసారి రసవత్తరంగానే సాగుతోంది!. సౌరభ్ తివారి (42, 31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), క్వింటన్ డికాక్ (33, 20 బంతుల్లో 5 ఫోర్లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 162/9 స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (12), హార్దిక్ పాండ్య (14) దూకుడుగా మొదలుపెట్టినా.. ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ పియూశ్ చావ్లా (1/21), లుంగి ఎంగిడి (3/38), దీపక్ చాహర్ (2/32), శామ్ కరణ్ (1/28) రాణించారు.
దూకుడుకు కళ్లెం! : స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ధోని మరో ఆలోచన లేకుండా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న సీమర్ దీపక్ చాహర్ ఐపీఎల్ 2020లో తొలి బంతి సంధించాడు. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తొలి బంతినే ఫైన్ లెగ్ దిశగా బౌండరీతో ఘనంగా మొదలుపెట్టాడు. పవర్‌ప్లేలో ముంబయి దూకుడు ప్రదర్శించింది. డికాక్ (33) ఐదు ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌ప్లేలో ముంబయి వేగంగా పరుగులు సాధించింది. క్రీజులో కుదురుకుంటున్న రోహిత్ శర్మను మిడ్ ఆఫ్‌లో ఆడేలా రెచ్చగొట్టిన ధోని.. చావ్లా బౌలింగ్‌లో డగౌట్‌కు చేర్చాడు. డికాక్ సైతం నిష్క్రమించటంతో సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. సౌరభ్ తివారీ భారీ షాట్లతో చెలరేగాడు. 92/2తో ముంబయి భారీ స్కోరు దిశగా సాగింది. రవీంద్ర జడేజా ఓవర్లో భారీగా పరుగులు పిండుకున్న తివారీ అర్థ సెంచరీ సాధించేలా కనిపించాడు. హార్దిక్ పాండ్య సైతం జడేజా ఓవర్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ సమయంలోనే ధోని కెప్టెన్సీ అనుభవం చూపించాడు. ఆఖరు ఓవర్లలో ముంబయి దూకుడుకు కళ్లెం వేశాడు. పొలార్డ్ (18), కృనాల్ పాండ్య (3) స్వేచ్ఛగా పరుగులు సాధించలేకపోయారు. దీంతో ముంబయి ఇండియన్స్ 162 పరుగులకే పరిమితం అయ్యింది.
స్కోరు వివరాలు :
ముంబయి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) శామ్ కరణ్ (బి) పియూశ్ చావ్లా 12, క్వింటన్ డికాక్ (సి) షేన్ వాట్సన్ (బి) శామ్ కరణ్ 33, సూర్యకుమార్ యాదవ్ (సి) శామ్ కరణ్ (బి) దీపక్ చాహర్ 17, సౌరభ్ తివారి (సి) డుప్లెసిస్ (బి) రవీంద్ర జడేజా 42, హార్దిక్ పాండ్య (సి) డుప్లెసిస్ (బి) రవీంద్ర జడేజా 14, కీరన్ పొలార్డ్ (సి) ధోని (బి) లుంగి ఎంగిడి 18, జేమ్స్ పాటిన్సన్ (సి) డుప్లెసిస్ (బి) లుంగి ఎంగిడి 11, రాహుల్ చాహర్ నాటౌట్ 2, ట్రెంట్ బౌల్ట్ (బి) దీపక్ చాహర్ 0, జశ్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-46, 2-48, 3-92, 4-121, 5-124, 6-136, 7-151, 8-156, 9-156, 10-
బౌలింగ్ : దీపక్ చాహర్ 3.4-0-28-2, శామ్ కరణ్ 4-0-28-1, లుంగి ఎంగిడి 4-0-38-3, పియూశ్ చావ్లా 4-0-21-1, రవీంద్ర జడేజా 4-0-42-2.