Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 బంతుల్లో మెరుపు అర్థ సెంచరీ
- మూడు వికెట్లతో మెరిసిన పేసర్
- ఢిల్లీ క్యాపిటల్స్ 152/7
దుబాయ్ (యుఏఈ)
పంజాబ్ పేసర్ మహ్మద్ షమి (3/15) విజృంభణతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ కకావికలం. 13/3తో పీకల్లో కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయష్ అయ్యర్ (39), రిషబ్ పంత్ (31) నాల్గో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేసినా.. ఒక్క పరుగు వ్యవధిలో ఇద్దరూ డగౌట్‌కు చేరుకున్నారు. ఢిల్లీ 120 పరుగులైనా చేస్తుందా? అనే అనుమానం. పంజాబ్ ప్రణాళికలను మార్కస్ స్టోయినిస్ (53 రనౌట్, 21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెల్లాచెదురు చేశాడు. మెరుపు అర్థ సెంచరీతో ఢిల్లీకి 157/8 స్కోరు అందించాడు.
ఔరా మార్కస్ : టాస్ నెగ్గిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మహ్మద్ షమి ధాటికి క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ నిలువలేదు. శిఖర్ ధావన్ (0) వికెట్ల వెనకాల జీవనదానం పొందినా.. అదే బంతికి రనౌట్‌గా నిష్క్రమించాడు. పృథ్వీ షా, హెట్‌మయర్‌లు షాట్ సెలక్షన్ లోపంతో సులువుగా వికెట్ పారేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్‌లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. నాల్గో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఢిల్లీని గౌరవ ప్రద స్కోరు దిశగా నడిపించారు. కానీ వరుస ఓవర్లలో పంత్, అయ్యర్ డగౌట్‌కు చేరుకోవటంతో ఢిల్లీ కథ మొదటికి చేరుకుంది. కానీ ఆఖర్లో మార్కస్ స్టోయినిస్ సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. షెల్డన్ కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో మెరిసిన స్టోయినిస్... క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 6, 4, 4, 4, 6తో విరుచుకుపడ్డాడు. ఆఖరు ఓవర్లో 30 పరుగులు పిండుకున్న ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 157/8తో భారీ స్కోరు సాధించింది. క్రిస్ జోర్డాన్ 0/56తో దారుణంగా విఫలమయ్యాడు.
షమి అదుర్స్ : స్టార్ పేసర్ మహ్మద్ షమి ఐపీఎల్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. గత సీజన్లో చెన్నై 2/17, ముంబయిపై 3/22 గణాంకాలను ఢిల్లీ క్యాపిటల్స్‌పై మెరుగుపర్చుకున్నాడు. నాలుగు ఓవర్లలో 3/15తో ఉత్తమ ప్రదర్శన చేశాడు. పవర్ ప్లేలో మూడు ఓవర్లు వేసిన షమి 2 వికెట్లు కూల్చి 8 పరుగులే ఇచ్చాడు. యువ పృథ్వీ షా (5), ప్రమాదకర షిమ్రోన్ హెట్మయర్ (7)లను వెనక్కి పంపాడు. షమి అద్భుత బంతులు వేసిన వేళ.. క్యాపిటల్స్ కుర్ర బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపిక సైతం పంజాబ్‌కు కలిసొచ్చింది. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ మిడాఫ్‌లో వరుస సిక్సర్లతో ప్రమాదకరంగా పరిణమించిన తరుణంలో రాహుల్ బంతిని షమికి అందించాడు. మిడాఫ్లోనే అయ్యర్ కథకు ముగింపు పలికిన షమి.. దుబారులో మరుపురాని ప్రదర్శన చేశాడు. యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోరు ఐపీఎల్ అరంగ్రేటంలో అదరగొట్టాడు. 1/22తో విశేషంగా ఆకట్టుకున్నాడు.
స్కోరు వివరాలు :
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా (సి) క్రిస్ జోర్డాన్ (బి) మహ్మద్ షమి 5, శిఖర్ ధావన్ రనౌట్ (రాహుల్/గౌతమ్) 0, షిమ్రోన్ హెట్మయర్ (సి) మయాంక్ అగర్వాల్ (బి) మహ్మద్ షమి 7, శ్రేయాష్ అయ్యర్ (సి) క్రిస్ జోర్డాన్ (బి) మహ్మద్ షమి 39, రిషబ్ పంత్ (బి) రవి బిష్ణోరు 31, మార్కస్ స్టోయినిస్ రనౌట్ (రాహుల్/పూరన్) 53, అక్షర్ పటేల్ (సి) రాహుల్ (బి) షెల్డన్ కాట్రెల్ 6, రవిచంద్రన్ అశ్విన్ (సి) మహ్మద్ షమి (బి) షెల్డన్ కాట్రెల్ 4, కగిసో రబాడ నాటౌట్ 0, ఎన్రిచ్ నోజె నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు : 09, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-6, 2-9, 3-13, 4-86, 5-87, 6-96, 7-127, 8-154.
బౌలింగ్ : షెల్డన్ కాట్రెల్ 4-0-24-2, మహ్మద్ షమి 4-0-15-3, క్రిస్ జోర్డాన్ 4-0-56-0, కృష్ణప్ప గౌతమ్ 4-0-39-0, రవి బిష్ణోరు 4-0-22-1.