Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్ పై కోహ్లిసేన విజయం
- ఛేదనలో హైదరాబాద్ చతికిల
దుబాయ్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బోణి కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు అలవోక విజయాన్ని సాధించింది. 164 పరుగుల ఛేదనలో హైదరాబాద్ చతికిల పడింది. 19.4 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (61, 43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీకి తోడు మనీశ్ పాండే (34, 33 బంతుల్లో 1 ఫోర్) రాణించటంతో హైదరాబాద్ గెలుపు దిశగా సాగింది. కానీ మిడిల్ ఆర్డర్ పతనంతో బెంగళూర్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో డెవిడ్ వార్నర్ (6) రనౌట్ కాగా.. ప్రియాం గార్గ్ (12), విజయ్ శంకర్ (0), అభిషేక్ శర్మ (7), రషీద్ ఖాన్ (6), భువనేశ్వర్ కుమార్ (0), సందీప్ శర్మ (9)లు నిరాశపరిచారు. స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ మూడు కీలక వికెట్లతో సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. బెంగళూర్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ అరంగేట్ర బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్ (56, 42 బంతుల్లో 8 ఫోర్లు), మిస్టర్ 360 ఏబి డివిలియర్స్ (51, 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తొలుత రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 163/5 స్కోరు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (14) సన్‌రైజర్స్‌పై మళ్లీ విఫలమయ్యాడు.
దూకుడుగా మొదలుపెట్టి..
టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయ్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూర్‌కు ఓపెనర్లు అరోన్ ఫించ్ (29, 27 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (56, 42 బంతుల్లో 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఇద్దరూ క్రీజులో కుదురుకోవటంతో బెంగళూర్ భారీ స్కోరుపై కన్నేసింది. యువ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఔరా అనిపించాడు. 11 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఓపెనింగ్ జోడీ.. వరుస బంతుల్లో డగౌట్‌కు చేరింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (14) హైదరాబాద్‌పై మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. 13 బంతుల్లో 14 పరుగులు చేసిన కోహ్లి ఒక్క బౌండరీ కొట్టలేదు. కోహ్లి నిష్క్రమణ తర్వాత ఏబి డివిలియర్స్ (51) చెలరేగాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లలో కదంతొక్కిన డివిలియర్స్ బెంగళూర్‌కు మంచి స్కోరు అందించాడు. సన్‌రైజర్స్ స్టార్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్లకు వికెట్లు దక్కలేదు.
పవర్ఫుల్ పడిక్కల్
దేశవాళీ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన యువ బ్యాట్స్‌మన్ దేవదత్ పడిక్కల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్ తోడుగా బెంగళూర్ ఇన్నింగ్స్ ఆరంభించిన పడిక్కల్.. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడాడు. ఓ ఎండ్‌లో ఫించ్ తడబడుతుండగా.. పడిక్కల్ పరుగుల వేటలో చెలరేగాడు. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, నటరాజన్‌లపై విరుచుకుపడ్డాడు. 8 ఫోర్లతో 36 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ బాదిన పడిక్కల్ విశేషంగా ఆకట్టుకున్నాడు. నాణ్యమైన బౌలింగ్‌పై ఎటువంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించిన పడిక్కల్ అరోన్ ఫించ్ జతగా తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం జోడించాడు. దేవదత్ పడిక్కల్ రాకతో బెంగళూర్ టాప్ ఆర్డర్లో విరాట్, డివిలియర్స్‌పై భారం కాస్త తగ్గనుంది!.
స్కోరు వివరాలు :
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ : 163/5 (దేవదత్ పడిక్కల్ 56, ఏబీ డివిలియర్స్ 51, అభిóషేక్ శర్మ 1/16, విజరు శంకర్ 1/14)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 153/10 ( జానీ బెయిర్‌స్టో 61, మనీశ్ పాండే 34, యుజ్వెంద్ర చాహల్ 3/18, శివం దూబె 2/15)