Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 54 బంతుల్లో 80 పరుగుల ఇన్నింగ్స్
- రాణించిన సూర్యకుమార్, హార్ధిక్
- ముంబయి ఇండియన్స్ 195/5
అబుదాబి : ఐపీఎల్లో బ్యాట్స్‌మన్‌గా పేలవ రికార్డున్న రోహిత్ శర్మ యుఏఈలో చెలరేగాడు. బుధవారం అబుదాబి ఎమిరేట్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (80, 54 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మకు తోడు సూర్యకుమార్ యాదవ్ (47, 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సౌరభ్ తివారి (21, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), హార్దిక్ పాండ్య (18, 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 195/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కత యువ పేసర్ శివం మవి (2/32) రాణించాడు.
రోహిత్ శర్మ దూకుడు
టాస్ నెగ్గిన కోల్‌కత నైట్‌రైడర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ ఇక్కడే ఆడిన ముంబయి ఇండియన్స్ తెలిసిన పరిస్థితులను సొమ్ముచేసుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (1) ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా.. ముంబయి ఇండియన్స్ జోరు తగ్గలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్‌కు 90 పరుగులు జోడించాడు. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లోనే 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిశాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ దూకుడుగా పరుగులు రాబట్టాడు. దీంతో ఈ జోడీ 9.3 ఓవర్లలోనే 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. సూర్యకుమార్ యాదవ్ రనౌట్‌తో క్రీజులోకి వచ్చిన సౌరభ్ తివారి (21) స్కోరు వేగాన్ని తగ్గనీయలేదు. ఓ సిక్సర్, ఫోర్‌తో 13 బంతుల్లోనే 21 పరుగులు సాధించాడు. 39 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌తో అర్ధ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. శతకం దిశగా సాగాడు. కానీ అబుదాబి పరిస్థితుల్లో నీరసించిన రోహిత్ శర్మ.. తనదైన శైలిలో బంతిని బాదలేకపోయాడు. ఆ క్రమం లోనే శివం మవి ఓవర్లో క్యాచౌట్ అయ్యాడు. నరైన్ బౌలింగ్‌లో తివారి నిష్క్రమించగా.. హార్దిక్ పాండ్య (18) తొలుత నరైన్ ఓవర్లో నాలుగు బంతులు డిఫెండ్ చేసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లో పాట్ కమిన్స్‌పై వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్‌తో విజృంభించాడు. క్రీజులోపల నిలబడి ఆడిన పాండ్య.. రసెల్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో కృనాల్ పాండ్య (1 నాటౌట్), కీరన్ పొలార్డ్ (13 నాటౌట్) ముంబయి ఇండియన్స్ స్కోరును 195కు చేర్చారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండగా.. ముంబయి 230 స్కోరు దిశగా సాగింది. కానీ వరుస వికెట్లతో వేగానికి కళ్లెం వేసిన కోల్‌కత.. రోహిత్‌సేనను 200 పరుగుల లోపు నిలువరించారు. కరీబియన్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌కు ఇది ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున 150వ మ్యాచ్ కావటం విశేషం.
స్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్ : క్వింటన్ డికాక్ (సి) నిఖిల్ నాయక్ (బి) శివం మవి 1, రోహిత్ శర్మ (సి) కమిన్స్ (బి) శివం మవి 80, సూర్యకుమార్ యాదవ్ రనౌట్ (నరైన్/మోర్గాన్) 47, సౌరభ్ తివారి (సి) కమిన్స్ (బి) నరైన్ 21, హార్దిక్ పాండ్య (హిట్ వికెట్) రసెల్ 18, కీరన్ పొలార్డ్ నాటౌట్ 13, కృనాల్ పాండ్య నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 195.
వికెట్ల పతనం : 1-8, 2-98, 3-147, 4-177, 5-180.
బౌలింగ్ : సందీప్ వారియర్ 3-0-34-0, శివం మవి 4-1-32-2, పాట్ కమిన్స్ 3-0-49-0, సునీల్ నరైన్ 4-0-22-1, అండ్రీ రసెల్ 2-0-17-1, కుల్దీప్ యాదవ్ 4-0-39-0.
ఏడు బంతులే ఎదుర్కొని, పరిస్థితులపై అంచనాకు రాలేను. మాది మంచి ప్రదర్శన. ఆరంభంలోనే డికాక్ అవుటైనా.. రోహిత్, సూర్యకుమార్ రాణించారు. రోహిత్ శర్మ క్లాస్ ఆటను కనబరిచాడు. 195 చాలా మంచి స్కోరు. ఐపీఎల్లో ఏండ్లుగా క్రికెటర్లు ఓ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాంఛైజీకి మారుతున్నారు. కానీ నేను 11 ఏండ్లుగా ఒకే జట్టుతో ఉంటున్నాను. ఓ చిన్న పట్టణం నుంచి క్రికెటర్ ఐపీఎల్లో 150 మ్యాచులు ఆడటం పెద్ద ఘనతే'
- కీరన్ పొలార్డ్. (ముంబయి తరఫున 150వ మ్యాచ్).