Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్, కోల్‌కత ఢీ నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
అబుదాబి (యుఏఈ) :
సన్‌రైజర్స్ హైదరా బాద్, కోల్‌కత నైట్‌రైడర్స్.. ఐపీఎల్లో తమ తొలి మ్యాచుల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగాయి. సన్‌రైజర్స్ అనూహ్య ఓటమి చవిచూడగా.. కోల్‌కత కనీసం గెలుపు బాటలో కనిపించలేదు. బయో బబుల్ ఐపీఎల్లో తొలి విజయం నమోదు చేసేందుకు ఈ రెండు జట్లు నేడు ముఖాముఖి తలపడుతున్నాయి. అబుదాబిలో నేడు రాత్రి 7.30 గంటలకు కోల్‌కత, హైదరాబాద్ మ్యాచ్ ఆరంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బలోపేతంపై దృష్టి సారించింది. మిచెల్ మార్ష్ గాయంతో టోర్నీకి దూరం కాగా, కేన్ విలియమ్సన్ కోలుకున్నది లేనిది తెలియరాలేదు. టాప్ ఆర్డర్లో డెవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండేలు ఫామ్‌లో ఉన్నారు. యువ బ్యాట్స్‌మెన్ ప్రియాం గార్గ్, అభిషేక్ వర్మలు రాణించాలని చూస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు మరింత మెరుగ్గా ప్రత్యర్థిని కట్టడి చేయాల్సి ఉంది. ఇక కోల్‌కత విషయానికొస్తే.. స్టార్ బ్యాట్స్‌మెన్ అండ్రీ రసెల్, ఇయాన్ మోర్గాన్‌లు తొలి మ్యాచ్‌లో తేలిపోయారు. నేడు సన్‌రైజర్స్‌పై వీరిద్దరికి తోడు సునీల్ నరైన్, శుభ్‌మన్ గిల్ రాణిస్తే కోల్‌కత గెలుపుపై కన్నేసేందుకు అవకాశం కనిపిస్తోంది.