Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 142/4కే హైదరాబాద్ పరిమితం
- మనీశ్ పాండే అర్థ సెంచరీ
- రాణించిన కోల్‌కత బౌలర్లు
విజయం సాధించాల్సిన తొలి మ్యాచ్‌లో అనుభవలేమి మిడిల్ ఆర్డర్ కారణంగా ఓటమి దరిచేరింది. అనుభవజ్ఞులు వృద్దిమాన్ సాహా, మహ్మద్ నబిలు మిడిల్లో రావటంతో సన్‌రైజర్స్ కథ మారుతుందనే అనుకు న్నారు. కానీ మైదానంలో షో అందుకు భిన్నంగా సాగింది. సాహా 31 బంతుల్లో 30 పరుగులే చేయగా.. కోల్కతతో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 142/4 పరుగులే చేసింది. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ భారీ షాట్లు కొట్టేందుకు సన్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. ఆరెంజ్ ఆర్మీపై నైట్‌రైడర్స్ పక్కా ప్రణాళిక అమలు చేసింది!.
అబుదాబి (యుఏఈ) : సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ బ్యాట్‌తో తడబడింది. బయో సెక్యూర్ బబుల్ ఐపీఎల్లో రెండో మ్యాచ్‌లోనూ బ్యాట్‌తో నిరాశపరిచింది. శనివారం అబుదాబిలో కోల్‌కత నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యింది. మనీశ్ పాండే (51, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్ వార్నర్ (36, 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా హైదరాబాద్ 142/4 స్కోరు సాధించింది. హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌కు పక్కా ప్రణాళికలు అమలు చేసిన కోల్‌కత ఆ దిశగా సక్సెస్ సాధించింది. బౌలర్లు మెరిస్తేనే.. భారీ హిట్టర్లతో కూడిన కోల్‌కతపై హైదరాబాద్ విజయం సాధించగలదు.
ఆదుకున్న మనీశ్ పాండే
టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశ్చర్యకరంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అబుదాబిలో మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు జట్లు మొగ్గుచూపుతున్నాయి. కానీ స్కోర్లను కాపాడుకోవటంలో ఆరితేరిన సన్‌రైజర్స్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కే ఓటేసింది. సన్‌రైజర్స్‌కు ఆశించిన ఆరంభం మాత్రం దక్కలేదు. జానీ బెయిర్‌స్టో (5) పది బంతుల్లో ఐదు పరుగులే చేశాడు. పాట్ కమిన్స్‌కు వికెట్ కోల్పోయాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ డెవిడ్ వార్నర్ (36, 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకలిసిన మనీశ్ పాండే (51, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతులు ఆడిన డెవిడ్ వార్నర్ దూకుడుగా పరుగులు రాబట్టలేదు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో మెరిసిన మనీశ్ పాండే 35 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. భారీ షాట్లు కొట్టేందుకు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. మనీశ్ పాండే వచ్చీ రాగానే రెండు సిక్సర్లతో కదం తొక్కినా.. బౌండరీల్లో నిలకడ చూపించలేదు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వార్నర్ వెనుదిరగగా.. నం.4 బ్యాట్స్‌మన్‌గా వచ్చిన వృద్దిమాన్ సాహా (30, 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెప్పించలేదు. స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు సైతం ఇబ్బంది పడిన సాహా.. 31 బంతుల్లో 30 పరుగులే చేశాడు. సాహా ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ కనీసం ఓ 20 పరుగులు కోల్పోయింది!. ఆఖర్లో మహ్మద్ నబి (11 నాటౌట్, 8 బంతుల్లో 2 ఫోర్లు), అభిషేక్ శర్మ (2 నాటౌట్) జట్టు స్కోరును 140 మార్క్ దాటించారు. కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 142 పరుగులకే పరిమితం అయ్యింది. చేతిలో వికెట్లు ఉన్నా, హైదరాబాద్ ధనాధన్ ఆటకు వెళ్లలేకపోయింది. మనీశ్ పాండే, వృద్దిమాన్ సాహా టీ20 తరహాలో ఆడలేకపోయారు!. కోల్‌కత బౌలర్లలో పాట్ కమిన్స్ (1/19), వరుణ్ చక్రవర్తి (1/25), అండ్రీ రసెల్ (1/16) రాణించారు.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : డెవిడ్ వార్నర్ (సి,బి) వరుణ్ చక్రవర్తి 36, జానీ బెయిర్‌స్టో (బి) పాట్ కమిన్స్ 5, మనీశ్ పాండే (సి,బి) అండ్రీ రసెల్ 51, వృద్దిమాన్ సాహా రనౌట్ (కమిన్స్/కార్తీక్) 30, మహ్మద్ నబి నాటౌట్ 11, అభిషేక్ శర్మ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 142.
వికెట్ల పతనం : 1-24, 2-59, 3-121, 4-138.
బౌలింగ్ : సునీల్ నరైన్ 4-0-31-0, పాట్ కమిన్స్ 4-0-19-1, శివం మవి 2-0-15-0, కుల్దీప్ యాదవ్ 2-0-15-0, వరుణ్ చక్రవర్తి 4-0-25-1, కమలేశ్ నాగర్కోటి 2-0-17-0, అండ్రీ రసెల్ 2-0-16-1.