Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫించ్, దేవ్ దత్, డివిలియర్స్ అర్థ సెంచరీలు
- రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 201/3
దుబాయ్ (యుఏఈ)
ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్, 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవ్‌దత్ పడిక్కల్ (54, 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అరోన్ ఫించ్ (52, 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. నాణ్యమైన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ విభాగంపై బెంగళూర్ బ్యాట్స్‌మెన్ దండెత్తారు. దుబాయ్ పిచ్‌పై 201/3 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. శివం దూబె (27 నాటౌట్, 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో బెంగళూర్‌కు సీజన్లో తొలి భారీ స్కోరు అందించాడు. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (2/34), రాహుల్ చాహర్ (1/31) వికెట్లు పడగొట్టారు.
కలిసికట్టుగా కొట్టారు : టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్ దుబారులో ఛేదనకు ఓటేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూర్ తొలి ఓవర్ నుంచీ దూకుడుగా ఆడింది. అరోన్ ఫించ్ (52) పవర్‌ప్లేలో ధనాధన్ అనిపించాడు. 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. ఫించ్‌కు మరో ఎండ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (54) చక్కగా సహకరించాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ రన్‌రేట్‌ను ముందుకు నడిపించాడు. ఫించ్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి (3) మళ్లీ నిరాశపరిచాడు. 11 బంతులు ఆడిన కోహ్లి.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రోహిత్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ముంబయిపై మంచి రికార్డున్న ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్) పడిక్కల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. దేవ్‌దత్ 2 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా, ఏబీ డివిలియర్స్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేశాడు. కీరన్ పొలార్డ్ అద్భుత క్యాచ్‌తో దేవ్‌దత్ అవుటవగా.. శివం దూబె (27 నాటౌట్) శివమెత్తాడు. పాటిన్సన్ వేసిన ఆఖరు ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 10 బంతుల్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. దూబె ధనాధన్‌తో బెంగళూర్ అలవోకగా 200 మార్క్ దాటేసింది. పడిక్కల్, డివిలియర్స్, దూబె ధాటికి ముంబయి బౌలర్లు విలవిల్లాడారు. ఆఖరు ఏడు ఓవర్లలో ఏకంగా 105 పరుగులు పిండుకున్న బెంగళూర్.. దుబారులో ముంబయి బౌలర్లకు షాకిచ్చింది.
స్కోరు వివరాలు
బెంగళూర్ ఇన్నింగ్స్ : దేవ్ దత్ పడిక్కల్ (సి) పొలార్డ్ (బి) ట్రెంట్ బౌల్ట్ 54, అరోన్ ఫించ్ (సి) పొలార్డ్ (బి) ట్రెంట్ బౌల్ట్ 52, విరాట్ కోహ్లి (సి) రోహిత్ శర్మ (బి) రాహుల్ చాహర్ 3, ఏబీ డివిలియర్స్ నాటౌట్ 55, శివం దూబె నాటౌట్ 27, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201.
వికెట్ల పతనం : 1-81, 2-92, 3-154.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-34-2, జేమ్స్ పాటిన్సన్ 4-0-51-0, రాహుల్ చాహర్ 4-0-31-1, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-42-0, కృనాల్ పాండ్య 3-0-23-0, కీరన్ పొలార్డ్ 1-0-13-0.