Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లో విలియమ్స్ విజయం
- క్విటోవా, బెర్టెన్స్ ముందంజ
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ (ఫ్రాన్స్) : కెరీర్ 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను సెరెనా విలియమ్స్ ఘనంగా మొదలుపెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సహచర అమెరికన్ అథ్లెట్‌పై సాధికారిక విజయం నమోదు చేసింది. అమెరికాకే చెందిన క్రిస్టీపై 7-6(7-2), 6-0తో సెరెనా విలియమ్స్ తొలి రౌండ్లో సూపర్ విజయాన్ని అందుకుంది. మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ మాజీ సెమీఫైనలిస్ట్లు పెట్రా క్విటోవా, కికి బెర్టెన్స్లు సైతం తొలి రౌండ్లో అలవోక విజయాలు సాధించారు. మట్టికోర్టు గ్రాండ్‌స్లామ్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు.
సెరెనా అలవోకగా.. : ఆరో సీడ్, టైటిల్ ఫేవరేట్ సెరెనా విలియమ్స్ తొలి రౌండ్లో వరుస సెట్లలో విజయం సాధించింది. అమెరికాకే చెందిన క్రిస్టీ ఆV్ా్నతో మ్యాచ్‌లో తొలి సెట్ కోసం సెరెనా టైబ్రేకర్‌లో నెగ్గాల్సి వచ్చింది. టైబ్రేకర్‌లో 7-2తో ఆధిపత్యం చూపించిన సెరెనా విలియమ్స్ 7-6తో తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో సెరెనా విలియమ్స్ సత్తా చాటింది. వరుసగా గేములు గెల్చుకుంది. తనదైన శైలిలో 11 ఏస్‌లతో విరుచుకుపడిన సెరెనా విలియమ్స్.. క్రిస్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-0తో రెండో సెట్‌ను రెండో రౌండ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఏడో సీడ్ చెక్ రిపబ్లిక్ భామ పెట్రా క్విటోవా 6-3, 7-5తో ఫ్రాన్స్ క్రీడాకారిణి ఓసియన్ డాడిన్పై వరుస సెట్లలో క్విటోవా విజయం సాధించింది. ఎనిమిది ఏస్‌లతో మెరిసిన క్విటోవా.. మూడు సార్లు ప్రత్యర్థి సర్వ్‌ను బ్రేక్ చేసింది. కికి బెర్టెన్స్ రెండో రౌండ్ చేరుకునేందుకు మూడు సెట్లు ఆడాల్సి వచ్చింది. ఉక్రెయిన్ అమ్మాయి కేథరినా జవాస్కపై 2-6, 6-2, 6-0తో బెర్టెన్స్ గెలుపొందింది. కేథరినా ఐదు బ్రేక్ పాయింట్లు సాధించగా.. ఎనిమిది సార్లు కేథరిన్ సర్వ్‌ను బ్రేక్ చేసిన బెర్టెన్స్ పైచేయి సాధించింది. తొలి సెట్‌ను కోల్పోయినా.. చివరి రెండు సెట్లను పూర్తి ఆధిక్యంతో గెల్చుకుంది. సారా ఎరాని 6-2, 6-1తో మోనికపై వరుస సెట్లలో అలవోక విజయం సాధించింది. బల్గేరియా ప్లేయర్ పిరొంకోవ 6-3, 6-3తో అండ్రీ పెట్కోవిక్పై వరుస సెట్లలో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది.
థీమ్ మొదలెట్టాడు! : యుఎస్ ఓపెన్ చాంపియన్ డొమినిక్ థీమ్ మట్టికోర్టులో టైటిల్ వేట మొదలెట్టాడు. క్రోయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్‌పై వరుస సెట్ల విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మూడో రౌండ్ ఆస్ట్రియా స్టార్ 6-4, 6-3, 6-3తో తిరుగులేని విజయం సాధించాడు. మూడు ఏస్‌లతో మెరిసిన థీమ్.. ఆరు సార్లు సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. అమెరికా ఆటగాడు జాక్ సాక్ 6-4, 6-4, 6-3తో సహచర అమెరికన్‌పై అలవోక విజయం నమోదు చేశాడు.