Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ షెరిఫ్ పై 2-1తో గెలుపు
- రెండో రౌండ్‌కు ఒస్టాపెంకో
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ (ఫ్రాన్స్) : చెక్ రిపబ్లిక్ భామ కరొలినా ప్లిస్కోవా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో విజయారంభం గావించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్లిస్కోవా మెరుపు విజయం సాధించింది. ఓ గ్రాండ్‌స్లామ్ ప్రధాన టోర్నీలో ఆడుతున్న తొలి ఈజిప్ట్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన మేయర్ ఫెరిఫ్పై ప్లిస్కోవా 2-1తో గెలుపొందింది. 56 నిమిషాల తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో మేయర్ ఫెరిప్ 11-9తో సొంతం చేసుకుంది. తొలి సెట్‌ను 6-7తో కోల్పోయిన రెండో సీడ్ ప్లిస్కోవా.. తర్వాతి సెట్లలో గొప్పగా పుంజుకుంది. 6-2, 6-4తో వరుస సెట్టను సొంతం చేసుకుని రెండో రౌండ్‌కు చేరుకుంది. ఐదు ఏస్‌లతో మెరిసిన ప్లిస్కోవా..ఐదుసార్లు మేయర్ షెరిఫ్ సర్వ్‌ను బ్రేక్ చేసింది. చెక్ రిపబ్లిక్‌కే చెందిన క్రిస్టినా ప్లిస్కోవా సైతం తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. క్రోయేషియా ప్లేయర్ విక్టోరియా కుజుమొవపై 6-1, 6-2తో వరుస సెట్లలో ప్లిస్కోవా గెలుపొందింది. ఏడు ఏస్‌లు కొట్టిన ప్లిస్కోవా.. నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. జెలెనా ఒస్టాపెంకో 2017 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి విజయం సాధించింది. తొలి రౌండ్లో అమెరికా అమ్మాయి మడిసన్ బ్రెంగ్లీపై 6-2, 6-1తో విజయం సాధించింది. మడిసన్ సర్వీస్‌ను ఏకంగా ఏడుసార్లు బ్రేక్ చేసిన ఒస్టాపెంకో.. రెండు సెట్లలో మడిసన్కు కేవలం మూడు గేములే కోల్పోయింది. జపాన్ అమ్మాయి నవో హిబినో 6-4. 6-0తో మార్తాపై పైచేయి సాధించింది. అమెరికా ప్లేయర్, 21వ సీడ్ జెన్నీఫర్ బ్రాడీ 4-6, 6-3, 7-9తో క్లారా టాసన్‌పై మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. మూడో సెట్‌ను సూపర్ టైబ్రేకర్‌లో సొంతం చేసుకున్న బ్రాడీ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. డానిలీ రోస్ కొలిన్స్ 2-6, 6-2, 6-1తో మోనికపై మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. టిమియ బబోస్పై 6-4, 6-2తో అనా బోగ్డన్ గెలుపొందింది. మగ్ధ లినెట్టెపై అన్నీ ఫెర్నాండేజ్ 1-6, 6-2, 6-3తో విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్ మిల్మ్యాన్పై 3-6, 2-6, 5-7తో పాబ్లో కారెనో బస్టా విజయం సాధించాడు. స్పెయిన్ ఆటగాడికి మూడు సెట్లలోనూ ఆసీస్ ప్లేయర్ నుంచి ప్రతిఘటన ఎదురు కాలేదు. వాసెక్ పాప్పిల్పై 6-3, 6-1, 6-3తో మాట్టో బెర్రెట్టిని వరుస సెట్లలో విజయం నమోదు చేశాడు. లాయిడ్ హ్యారిస్ 6-4, 6-4, 7-6(9-7)తో అలెక్సీ పాపిరిన్పై అలవోక విజయం సాధించాడు. క్రిస్టియన్ గారెన్ 6-4, 4-6, 6-1, 6-4తో పిలిప్‌పై గెలుపొందగా..మార్క్ పోల్మాన్స్ 6-2, 6-2, 3-6, 6-3తో హంబర్ట్‌పై విజయం సాధించాడు.