Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీపై 15పరుగులతో ఘన విజయం
- రాణించిన బెయిర్‌స్టో, వార్నర్, విలియమ్సన్
అబుదాబి (యుఏఈ): సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్లో తొలి విజయం సాధించింది. మంగళవారం అబుదాబిలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (53, 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీకి తోడు కెప్టెన్ డెవిడ్ వార్నర్ (45, 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41, 26 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 147/7 పనరుగులు మాత్రమే చేయగలిగింది శికర్ ధావన్(34) రిశతంతు (28), రాణించినా లాభం లేకపోయింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్' (3/14 మూడు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ని కోలుకోలేని దెబ్బ తీశాడు.
బెయిర్‌స్టో అర్థ సెంచరీ : టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. దీంతో అబుదాబి పిచ్‌పై తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వచ్చింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (53, 48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ వార్నర్ (45, 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు శుభారంభం అందించారు. క్యాపిటల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. దీంతో వార్నర్,బెయిర్‌స్టో ఎదురు దాడికి వెళ్లకుండా.. సమయం కోసం ఎదురుచూశారు. తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలో ఓపెనర్లు 77 పరుగులు జోడించారు. వార్నర్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో సీజన్లో తొలి అర్థ సెంచరీ దిశగా సాగాడు. కానీ అమిత్ మిశ్రాపై రెండోసారి విఫల రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించిన వార్నర్.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ చొరవ తీసుకుని రివ్యూకు వెళ్లగా క్యాచౌట్‌గా నిష్క్రమించాడు.
మూడో స్థానంలో వచ్చిన ఫామ్‌లో ఉన్న మనీశ్ పాండే (3) నిరాశ పరిచాడు. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గాయం నుంచి కోలుకుని సీజన్లో తొలిసారి ఆడుతున్న మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41, 26 బంతుల్లో 5 ఫోర్లు) క్లాస్ ఆటతో అలరించాడు. ఐదు ఫోర్లతో మెరిసిన విలియమ్సన్ క్లిష్టమైన అబుదాబి పిచ్‌పై బౌలర్లపై వంద శాతం నియంత్రణ సాధించాడు. అరంగేట్ర యువ హిట్టర్ అబ్దుల్ సమద్ (12 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఓ ఫోర్, సిక్సర్‌తో సన్‌రైజర్స్ స్కోరును 160మార్క్ దాటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ డెత్ ఓవర్లలో మరోసారి సత్తా చాటాడు. రెండు వికెట్లు కూల్చిన రబాడ.. నాలుగు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి హైదరాబాద్ జోరుకు కళ్లెం వేశాడు. అమిత్ మిశ్రా సైతం రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ ఇన్నింగ్స్: డెవిడ్ వార్నర్ (సి) రిషబ్ పంత్ (బి) అమిత్ మిశ్రా 45, జానీ బెయిర్‌స్టో (సి) ఎన్రిచ్ నోర్జ్టె (బి) కగిసో రబాడ 53, మనీశ్ పాండే (సి) కగిసో రబాడ (బి) అమిత్ మిశ్రా 3, కేన్ విలియమ్సన్ (సి) అక్షర్ పటేల్ (బి) కగిసో రబాడ 41, అబ్దుల్ సమద్ నాటౌట్ 12, అభిషేక్ శర్మ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-77, 2-92, 3-144, 4-160.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 3-0-26-0, కగిసో రబాడ 4-0-21-2, ఎన్రిచ్ నోర్జ్టె 4-0-40-0, మార్కస్ స్టోయినిస్ 3-0-22-0, అమిత్ మిశ్రా 4-0-35-2, అక్షర్ పటేల్ 2-0-14-0.