Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిస్ మోరీస్ ధనాధన్ ఇన్నింగ్స్
- పంజాబ్‌పై బెంగళూర్ 171/6
షార్జా (యుఏఈ)
19 ఓవర్లలో 147/6. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ స్కోరు ఇది. చిన్న బౌండరీల షార్జాలో ఇది స్వల్ప స్కోరు అయ్యేది. కానీ ఆఖరు ఆరు బంతుల్లో 24 పరుగులు పిండుకున్న బెంగళూర్ 171/6తో మెరుగైన స్కోరు సాధించింది. ఆఖరు నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టిన క్రిస్ మోరీస్ (25 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇసురు ఉదాన (10 నాటౌట్, 5 బంతుల్లో 1 సిక్స్) పంజాబ్ బౌలర్ల శ్రమను ఆరు బంతుల్లో ఆవరి చేశారు!. విరాట్ కోహ్లి (48, 39 బంతుల్లో 3 ఫోర్లు), శివం దూబె (23, 19 బంతుల్లో 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో రాణించారు. చావోరేవో తేల్చుకోవాల్సిన ఛేదనలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏం చేస్తుందో ఆసక్తికరం.
విరాట్, మోరీస్ మెరుపులు : టాస్ నెగ్గిన విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు అరోన్ ఫించ్ (20), దేవ్‌దత్ పడిక్కల్ (18) తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడేందుకు సహకరించలేదు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్ మిడిల్ ఓవర్లలో పరుగుల పొదుపు పాటించాడు. ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి (48) సైతం ధనాధన్ షాట్లు ఆడలేకపోయాడు. వికెట్లు చేతిలో ఉన్నా బెంగళూర్ వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఆఖరు ఐదు ఓవర్లలో దూకుడుకు రంగం సిద్ధం చేసుకోగా ఏబీ డివిలియర్స్ (2), కోహ్లిలను ఒకే ఓవర్లో అవుట్ చేశాడు షమి. ఈ ఇద్దరి నిష్క్రమణతో బెంగళూర్ స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందని అనిపించింది. కానీ ఆఖర్లో క్రిస్ మోరీస్ (25 నాటౌట్), ఇసురు ఉదాన (10 నాటౌట్) అద్భుతం చేశారు. పంజాబ్ స్టార్ పేసర్ మహ్మద్షమిపై ఆరు బంతుల్లో 24 పరుగులు పిండుకున్నారు. బెంగళూర్‌కు 171 పరుగుల భారీ స్కోరు అందించారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమి, మురుగన్ అశ్విన్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రిస్ జోర్డాన్, అర్షదీప్ సింగ్‌లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
స్కోరు వివరాలు :
బెంగళూర్ ఇన్నింగ్స్ : అరోన్ ఫించ్ (బి) అశ్విన్ 20, దేవ్‌దత్ పడిక్కల్ (సి) పూరన్ (బి) అర్షదీప్ సింగ్ 18, విరాట్ కోహ్లి (సి) రాహుల్ (బి) మహ్మద్ షమి 48, వాషింగ్టన్ సుందర్ (సి) క్రిస్ జోర్డాన్ (బి) అశ్విన్ 13, శివం దూబె (సి) రాహుల్ (బి) క్రిస్ జోర్డాన్ 23, ఏబీ డివిలియర్స్ (సి) దీపక్ హుడా (బి) మహ్మద్ షమి 2, క్రిస్ మోరీస్ నాటౌట్ 25, ఇసురు ఉదాన నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171.
వికెట్ల పతనం : 1-38, 2-62, 3-86, 4-127, 5-134, 6-136.
బౌలింగ్ : గ్లెన్ మాక్స్ వెల్ 4-0-28-0, మహ్మద్ షమి 4-0-45-2, అర్షదీప్ సింగ్ 2-0-20-1, రవి బిష్ణోరు 3-0-29-0, మురుగున్ అశ్విన్ 4-0-23-2, క్రిస్ జోర్డాన్ 3-0-20-1.