Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కోల్‌కత నైట్‌రైడర్స్‌తో ఢీ
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
అబుదాబి (యుఏఈ)
20-6. రెండు సార్లు చాంపియన్‌పై నాలుగు సార్లు చాంపియన్ ముఖాముఖి రికార్డు ఇది. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ముంబయి ఇండియన్స్‌ది తిరుగులేని ఆధిక్యం. యుఏఈలోనూ అది కొనసాగుతోంది. ప్రథమార్థంలో కోల్‌కతపై ముంబయి సాధికారిక విజయంతో చెలరేగింది. ఇప్పుడు ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలో ముంబయి దూసుకుపోతుండగా.. ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలతో కోల్‌కత సైతం ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. అన్ని విభాగాల్లోనూ ముంబయి ఇండియన్స్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోండగా.. కోల్‌కత సైతం సీజన్ సాగుతున్న కొద్ది మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అక్టోబర్ ఆరంభం నుంచి ఓటమే ఎరుగని ముంబయి ఇండియన్స్ నేడు వరుసగా ఐదో విజయంపై కన్నేసింది. గత మ్యాచ్‌లో కోల్‌కతపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, బుమ్రా, పాటిన్సన్, బౌల్ట్‌లు నేడు అబుదాబిలో అదే ప్రదర్శన పునరావృతం చేస్తారేమో చూడాలి.
తుది జట్లు (అంచనా) :
ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, జశ్‌ప్రీత్ బుమ్రా.
కోల్‌కత నైట్‌రైడర్స్ : శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, వికెట్ కీపర్), అండ్రీ రసెల్, పాట్ కమిన్స్, లాకీ ఫెర్గుసన్, కమలేశ్ నాగర్కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.