Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వికెట్లతో మెరిసిన హౌల్డర్
- రాజస్థాన్ రాయల్స్ 154/6
దుబాయ్ (యుఏఈ)
రాజస్థాన్ రాయల్స్‌తో గత మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. మలి మ్యాచ్‌లో విజయానికి గట్టి పునాది వేసుకుంది. బిగ్ హిట్టర్లతో కూడిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌ను క్రమం తప్పకుండా వికెట్లతో కట్టడి చేసిన ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు ఆ జట్టును 154 పరుగులకే పరిమితం చేశారు. సీజన్లో అరంగేట్ర సీమర్ జేసన్ హౌల్డర్ (3/33) రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో రాయల్స్ చివరి 11 ఓవర్లలో 8 వికెట్లు చేతిలో నిలుపుకున్నా.. ధనాధన్ ఆడలేకపోయింది. ఆ జట్టులో సంజు శాంసన్ (36, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్ (30, 32 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు.
జేసన్ మెరిసెన్! : గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన విండీస్ పేసర్ జేసన్ హౌల్డర్ (3/33)తో నిప్పులు చెరిగాడు. మూడు బౌండరీలతో ప్రమాదకరంగా మారిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప (19)ను తెలివిగా రనౌట్ చేసిన హౌల్డర్.. విధ్వంసకారుడు సంజు శాంసన్ (36)ను స్లో డెలివరీతో బోల్తా కొట్టించాడు. స్టీవ్ స్మిత్ (19), రియాన్ పరాగ్ (20)లు సైతం హౌల్డర్ బంతికే వికెట్ కోల్పోయారు. ఉతప్ప నిష్క్రమణతో బెన్ స్టోక్స్‌తో కలిసి సంజు శాంసన్ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. వేగంగా పరుగులు రాకపోయినా.. ఆఖర్లో విధ్వంసానికి పునాది వేశారు. కానీ వరుసగా వికెట్లు కూల్చిన సన్‌రైజర్స్ బౌలర్లు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆఖర్లో రాహుల్ జోఫ్రా ఆర్చర్ (16 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులు రాజస్థాన్‌కు 154 పరుగుల స్కోరు అందించింది. డెత్ ఓవర్లలో నటరాజన్ భారీగా పరుగులు ఇచ్చి.. హైదరాబాద్ లక్ష్యాన్ని కనీసం 10 పరుగులు పెంచాడు!. విజరు శంకర్ (1/15) ఆకట్టుకోగా.. రషీద్ ఖాన్ (1/20) రాణించాడు.
స్కోరు వివరాలు :
రాజస్థాన్ ఇన్నింగ్స్ : రాబిన్ ఉతప్ప రనౌట్ (హౌల్డర్) 19, బెన్ స్టోక్స్ (బి) రషీద్ ఖాన్ 30, సంజు శాంసన్ (బి) హౌల్డర్ 36, జోశ్ బట్లర్ (సి) నదీమ్ (బి) విజరు శంకర్ 9, స్టీవ్ స్మిత్ (సి) మనీశ్ పాండే (బి) హౌల్డర్ 29, రియాన్ పరాగ్ (సి) వార్నర్ (బి) హౌల్డర్ 20, రాహుల్ తెవాటియ నాటౌట్ 2, జోఫ్రా ఆర్చర్ నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు : 03, మొత్తం :(20 ఓవర్లలో 6 వికెట్లకు) 154.
వికెట్ల పతనం : 1-30, 2-86, 3-86, 4-110, 5-134, 6-135.
బౌలింగ్ : సందీప్ శర్మ 4-0-31-0, జేసన్ హౌల్డర్ 4-0-33-3, విజరు శంకర్ 3-0-15-1, టి నటరాజన్ 4-0-46-0, రషీద్ ఖాన్ 4-0-20-1, షాబాజ్ నదీమ్ 1-0-9-0.