Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4/18తో చెలరేగిన పేసర్
- శామ్ కరన్ ఒంటరి పోరాటం
- చెన్నై సూపర్ కింగ్స్ 114/9
షార్జా (యుఏఈ)
ముంబయి పేసర్ల మెరుపులతో షార్జాలో సిక్సర్ల వర్షం స్థానంలో వికెట్ల వేట కనిపించింది. మానసికంగా కుంగిపోయిన చెన్నై సూపర్‌కింగ్స్‌పై ముంబయి పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (4/18), జశ్‌ప్రీత్ బుమ్రా (2/25), స్పిన్నర్ రాహుల్ చాహర్ (2/22) విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో ఈ ఇద్దరి వాడి వేడి ముందు చెన్నై టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. టాప్ టాప్-4 బ్యాట్స్‌మెన్ సంయుక్తంగా మూడు పరుగులే చేశారు. డుప్లెసిస్ (1), రాయుడు (2), రుతురాజ్ (0), జగదీశన్ (0)లు బ్యాట్లేత్తేశారు. ఎం.ఎస్ ధోని (16) మెరుపులూ త్వరగా ముగియటంతో శామ్ కరన్ (52, 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెన్నైకి ఆదుకున్నాడు. కరన్ రాణించటంతో సూపర్‌కింగ్స్ తొలుత 114/9 పరుగులు చేసింది.
బౌల్ట్, బుమ్రా బూమ్! : చిన్న బౌండరీల షార్జా. స్వేచ్ఛ ఆడే అవకాశం చిక్కిన చెన్నై. ప్రియ ప్రత్యర్థి ముంబయిపై ఆ జట్టు ధనాధన్ ఖాయమే అనుకుంటే.. ముంబయి పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (4/18), జశ్‌ప్రీత్ బుమ్రా (2/25) క్రీజులో సూపర్‌కింగ్స్ కష్టాన్ని పెంచారు. బౌల్ట్ పవర్‌ప్లేలో వేసిన మూడు ఓవర్లలో మూడు వికెట్లు కూల్చగా.. బుమ్రా తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్‌కింగ్స్ కనీసం 50 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ (0), జగదీశన్ (0)లు డకౌట్ కాగా.. డుప్లెసిస్ (1), అంబటి రాయుడు (2)లు ఖాతా మాత్రమే తెరిచారు. పవర్‌ప్లేలోనే బ్యాటింగ్‌కు వచ్చిన ఎం.ఎస్ ధోని (16, 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీలతో ఊపుమీద కనిపించాడు. కానీ స్పిన్నర్ రాహుల్ చాహర్ బంతికి మహి నిష్క్రమించక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో యువ ఆల్‌రౌండర్ శామ్ కరన్ (52, 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఆదుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌తో టెయిలెండర్లూ పెవిలియన్‌కు చేరుకుంటున్నా.. ఓ ఎండ్‌లో కరన్ పోరాడాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు. షార్దుల్ ఠాకూర్ (11), ఇమ్రాన్ తాహీర్ (13 నాటౌట్) కరన్‌కు సహకరించారు. కరన్ ఒంటరి పోరాటంతో చెన్నై సూపర్‌కింగ్స్ 114 పరుగులు చేయగల్గింది. తొడ కండరాల గాయంతో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కీరన్ పొలార్డ్ ముంబయి నాయకత్వ పగ్గాలు అందుకున్నాడు.
స్కోరు వివరాలు
చెన్నై ఇన్నింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (ఎల్బీ) ట్రెంట్ బౌల్ట్ 0, డుప్లెసిస్ (సి) డికాక్ (బి) ట్రెంట్ బౌల్ట్ 1, అంబటి రాయుడు (సి) డికాక్ (బి) బుమ్రా 2, ఎన్ జగదీశన్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) జశ్‌ప్రీత్ బుమ్రా 0, ఎం.ఎస్ ధోని (సి) డికాక్ (బి) రాహుల్ చాహర్ 16, రవీంద్ర జడేజా (సి) కృనాల్ పాండ్య (బి) ట్రెంట్ బౌల్ట్, శామ్ కరన్ (బి) ట్రెంట్ బౌల్ట్ 52, దీపక్ చాహర్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చాహర్ 0, షార్దుల్ ఠాకూర్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) కౌల్టర్‌నైల్ 11, ఇమ్రాన్ తాహీర్ నాటౌట్ 13, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 114.
వికెట్ల పతనం : 1-0, 2-3, 3-3, 4-3, 5-21, 6-30, 7-43, 8-71, 9-114.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-1-18-4, జశ్‌ప్రీత్ బుమ్రా 4-0-25-2, కృనాల్ పాండ్య 3-0-16-0, రాహుల్ చాహర్ 4-0-22-2, నాథన్ కౌల్టర్‌నైల్ 4-0-25-1, కీరన్ పొలార్డ్ 1-0-4-0.