Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన హైదరాబాద్ బౌలర్లు
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 126/7
దుబాయ్ (యుఏఈ)
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణిస్తున్నారు. అనుకూల పిచ్ పరిస్థితులను ఆరెంజ్ ఆర్మీ సద్వినియోగం చేసుకుంటోంది. ముంబయిపై డబుల్ సూపర్ ఓవర్ విక్టరీ ఉత్సాహంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను సన్‌రైజర్స్ బౌలర్లు నిలువరించారు. బిగ్ హిట్టర్లతో కూడిన కింగ్స్‌ను 126 పరుగులకే పరిమితం చేశారు. వంద వికెట్ల క్లబ్లో చేరిన సందీప్ శర్మ (2/29), జేసన్ హౌల్డర్ (2/27), స్పిన్నర్ రషీద్ ఖాన్ (2/14) నిప్పులు చెరగటంతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ తేలిపోయింది. విధ్వంసకారుడు నికోలస్ పూరన్ (32 నాటౌట్, 28 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా క్రీజులో నిలిచినా.. ఏం చేయలేకపోయాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ మరో విజయానికి సగం పని పూర్తి చేసింది!.
పక్కా వ్యూహంతో...! : బిగ్ హిట్టర్లతో కూడిన పంజాబ్‌పై హైదరాబాద్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ (27, 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)ను స్పిన్ గన్ రషీద్ ఖాన్‌తో సాగనంపిన వార్నర్.. ప్రమాదకర క్రిస్ గేల్ (20, 20 బంతుల్లో 2 ఫోర్ల, 1 సిక్స్)కు జేసన్ హౌల్డర్తో చెక్ పెట్టాడు. తండ్రి మరణాన్ని దిగమింగి నేడు బరిలోకి దిగిన మన్దీప్ సింగ్ (17, 14 బంతుల్లో 1 ఫోర్) వికెట్‌తో వంద వికెట్ల క్లబ్లో అడుగుపెట్టిన సందీప్ శర్మ.. అదే ఉత్సాహంలో గ్లెన్ మాక్స్వెల్నూ వెనక్కి పంపాడు. వరుస బంతుల్లో క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను గ్లెన్ మాక్స్వెల్ (12) మరోసారి నిరాశపరిచాడు. సందీప్ శర్మ ఓవర్లో మాక్స్వెల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. నం.4 బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ (32 నాటౌట్) ఓ ఎండ్‌లో మౌనంగా ఉండిపోయాడు. ఆఖరు బంతి వరకు అతడు క్రీజులో నిలిచినా.. స్వేచ్ఛగా బ్యాటు ఝులిపించే అవకాశం సన్‌రైజర్స్ బౌలర్లు ఇవ్వలేదు. దీపక్ హుడా (0), క్రిస్ జోర్డాన్ (7)లు వెన్వెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. బౌలర్లు చెలరేగిన పిచ్‌పై పంజాబ్ 126 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, సందీప్ శర్మ, జేసన్ హౌల్డర్లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు :
పంజాబ్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (బి) రషీద్ ఖాన్ 27, మన్దీప్ సింగ్ (సి) రషీద్ ఖాన్ (బి) సందీప్ శర్మ 17, క్రిస్ గేల్ (సి) డెవిడ్ వార్నర్ (బి) జేసన్ హౌల్డర్ 20, నికోలస్ పూరన్ నాటౌట్ 32, గ్లెన్ మాక్స్వెల్ (సి) డెవిడ్ వార్నర్ (బి) సందీప్ శర్మ 12, దీపక్ హుడా (స్టంప్డ్) జానీ బెయిర్‌స్టో (బి) రషీద్ ఖాన్ 0, క్రిస్ జోర్డాన్ (సి) ఖలీల్ అహ్మద్ (బి) జేసన్ హౌల్డర్ 7, మురుగన్ అశ్విన్ రనౌట్ (విజరు శంకర్) 4, రవి బిష్ణోరు నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126.
వికెట్ల పతనం : 1-37, 2-66, 3-66, 4-85, 5-88, 6-105, 7-110.
బౌలింగ్ : సందీప్ శర్మ 4-0-29-2, ఖలీల్ అహ్మద్ 4-0-31-0, జేసన్ హౌల్డర్ 4-0-27-2, రషీద్ ఖాన్ 4-0-14-2, టి నటరాజన్ 4-0-23-0.