Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు సూపర్‌కింగ్స్‌తో ఢీ
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
దుబాయ్ (యుఏఈ)
12 మ్యాచుల్లో ఆరు విజయాలు, ఆరు పరాజయాలు. ఐపీఎల్ 2020 లీగ్ దశలో కోల్‌కత నైట్ రైడర్స్ ప్రదర్శన ఇది. 12 మ్యాచుల్లో ఆ జట్టు మిశ్రమ ప్రదర్శన చేసింది. చివరి మ్యాచ్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్‌లో చావోరేవో తేల్చుకునే రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉండగా.. నేడు ప్లే ఆఫ్స్‌కు దూరమై ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. టాప్-4లో నిలిచేందుకు కోల్‌కత పట్టుదలగా ఉండగా.. తను ఆడే చివరి మ్యాచుల్లో విజయాలతో సమీకరణాలను తలకిందులు చేసేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ వెనుకాడటం లేదు. గత మ్యాచ్‌లో గెలుపొందిన చెన్నై.. నేడు కోల్కతపైనా అదే జోరు చూపించాలని చూస్తోంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, శుభ్‌మన్ గిల్లు ఫామ్‌లో ఉన్నా.. మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సరైన సమయంలో సహకారం అందటం లేదు. ప్రమాదకారుడు అండ్రీ రసెల్ నేటి మ్యాచ్‌కు సైతం అందుబాటులో ఉండే చాన్స్ కనిపించటం లేదు. మరో వైపు యువ క్రికెటర్లను తుది జట్టులోకి తీసుకున్న ధోని.. స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాడు. నేటి మ్యాచ్‌లో విజయంపైనే కోల్‌కత ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. లేదంటే నెట్ రన్‌రేట్‌లో ఇతర జట్లను కోల్‌కత వెనక్కి నెట్టడం కష్టసాధ్యమని మోర్గాన్‌కు తెలుసు. మరి అందుకు తగినట్టుగా నేడు దుబారులో నైట్‌రైడర్స్ రాణిస్తుందా? చూడాలి.
తుది జట్లు (అంచనా) :
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎం.ఎస్ ధోని, జగదీశన్, రవీంద్ర జడేజా, శామ్ కరన్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, మోను కుమార్, ఇమ్రాన్ తాహీర్.
కోల్‌కత నైట్‌రైడర్స్ : శుభ్‌మన్ గిల్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, కమలేశ్ నాగర్కోటి, లాకీ ఫెర్గుసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ.