Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జింబాబ్వే-పాకిస్తాన్ తొలివన్డే
రావల్పిండి: పాకిస్తాన్ పర్యటనకు విచ్చేసిన జింబాబ్వేను చిత్తుచేస్తామని వన్డే కెప్టెన్ బాబర్ అజమ్ తెలిపాడు. ప్రపంచకప్ సూపర్‌లీగ్‌లో భాగంగా రావల్పిండి వేదికగా పాక్-జింబాబ్వే జట్ల మధ్య శుక్రవారంనుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం నవంబర్ 7-10మధ్య మూడు టి20ల సిరీస్ జరగనుంది. 2023 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా పాకిస్తాన్ అర్హత సాధించాలంటే ఐసిసి ర్యాంకింగ్స్‌లో టాప్-7 ఉంటేనే అది సాధ్యం కానుంది. జింబాబ్వేతో గతంలో తలపడిన 19 మ్యాచుల్లో పాక్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే పరాజయాన్ని చవిచూసింది. షాదాబ్ గాయం కారణంగా తొలి వన్డేకు దూరంకాగా.. యువ పేసర్ ముసా ఖాన్‌తోపాటు వాహబ్ రైజ్, షాహిన్ అఫ్రిది పేస్ విభాగాన్ని తమ భుజాలపై మోయనున్నారు.