Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇపుడు బాగానే ఉన్నా : కపిల్‌దేవ్
ముంబయి: గుండెపోటుతో ఆస్పత్రి నుంచి కోలుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మొదటిసారి ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. నా ఆరోగ్యం బాగుంది.. నా కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ కపిల్ ఓ వీడియోను షేర్ చేశారు. 1983లో ప్రపంచకప్ సాధించిన తన జట్టు (ఫ్యామిలీ) సభ్యులను కలవాలని ఉన్నదంటూ.. 1983 వరల్డ్‌కప్ టీమ్ సభ్యుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.
''నా ఫ్యామిలీ 83. మిమ్మల్ని త్వరగా కలవాలని ఆతృతగా ఉన్నది. నేను బాగానే ఉన్నాను. అతి త్వరలోనే అందరినీ కలుసుకుంటానని భావిస్తున్నా. సినిమా ఎప్పుడు విడుదలవుతుందో నాకు తెలియదు.. కానీ మిమ్మల్ని సాధ్యమైనంత త్వరలో కలిసేందుకు ప్రయత్నిస్తా. ఈ సంవత్సరం చివరకు వచ్చేశాం. తర్వాతి ఏడాది గొప్పగా ప్రారంభమవుతుందనే విశ్వాసం నాకు ఉన్నది. లవ్ యూ ఆల్'' అని 29 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియోలో పేర్కొన్నారు. 1983 ప్రపంచకప్ హీరో, టీమ్ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ గత గురువారం గుండెపోటుకు గురై ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఫోర్టీస్ ఆస్పత్రిలో చేరిన 61 ఏండ్ల కపిల్ దేవ్‌కు వైద్యులు యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. అనంతరం ఆయన కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జి చేసిన విషయం విదితమే.