Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు భారత క్రికెటర్లు
- ఐసోలేషన్‌కు తరలింపు: బీసీసీఐ,సీిఏ
- మూడో టెస్ట్‌లో తుది జట్టుకు ముగ్గురూ దూరమేనా?
మెల్బోర్న్: బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించి భారత క్రికెటర్లు ఐదుగురు బయట తిరగడం వివాదాస్పదమైంది. దీంతో వారందరినీ ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచాలని భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శనివారం నిర్ణయించాయి. బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించి రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, నవ్‌దీప్ సైనీ, రిషబ్ పంత్‌లు మెల్బోర్న్లో ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. వీరు న్యూ ఇయర్ సందర్భంగా బయట ఓ రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెస్టారెంట్లో అయిన ఖర్చును భరించిన అభిమానిని రిషబ్ పంత్ హగ్ చేసుకున్నాడన్న వార్తలు కూడా వైరల్ కాగా... అయితే అలాంటిదేమీ లేదని, అవన్నీ అవాస్తవమని ఆ అభిమాని ఖండించాడు.
రుజువైతే..
భారత క్రికెటర్లు ఐదుగురు బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే మాత్రం వీరు మూడో టెస్ట్‌కు దూరం కావాల్సి ఉరటురది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా బయోబబుల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వీరు వారం నుంచి రెండు వారాలపాటు జట్టుకు దూరమై ప్రత్యేక ఐసోలేషన్‌లో గడపాల్సి ఉంటుంది. ఇటీవలే పాకిస్తాన్ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వెళ్ళడంతో వీరిని ఆరు రోజులు జట్టుకు దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే.
గట్టి ఎదురు దెబ్బ..
నిబంధనలు ఉల్లంఘించినట్టు రుజువైతే మాత్రం టీమిండియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. జనవరి 7న సిడ్నీ వేదికగా మూడోటెస్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. బిసిసిఐ చివరి రెండు టెస్ట్‌లకు ప్రకటించిన జట్టులో వీరంతా ఉండగా.. వీరిలో ముగ్గురు మూడోటెస్ట్‌కు తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సి ఉంది. రోహిత్, శుభ్‌మన్ ఓపెనర్లుగా బరిలో దిగాల్సి ఉండగా.. పంత్ రెండో టెస్ట్‌కు వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. వీరిపై వేటు పడితే మాత్రం ఈ ముగ్గురూ మూడో టెస్ట్‌కు దూరమయ్యే ప్రమాదముంది. ఇదే జరిగితే భారత జట్టుకు రెరడో ఓపెనర్ దొరకడం కష్టంగా మారే ప్రమాదం ఉరది. బాక్సింగ్ డే టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రాణించి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మూడో టెస్ట్ కోసం భారతజట్టు రేపు(4న) సిడ్నీకి బయల్దేరి వెళ్ళనుంది.