Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబుదాబి: ఒలింపిక్స్కి టి10 ఫార్మాట్ క్రికెట్ సెట్ అవుతుందని వెస్టిండీస్ దిగ్గజ క్రికెట్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. జమైకాలోని తన ఇంట్లో శుక్రవారం ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. టి10 ఫార్మాట్ అయితే మ్యాచ్ ఫలితం త్వరగా వస్తుందని, అదే టి20 ఫార్మాట్ అయితే ఓ మ్యాచ్ ముగిసేందుకు 3గం.ల సమయం పట్టవచ్చన్నాడు. సమయాభావంతోనే క్రికెట్కు ఒలింపిక్స్లో చోటు దక్కలేదని, అమెరికాలోనూ ఇటీవల టి10 లీగ్ జరగడంతో అక్కడా క్రికెట్కు ఆదరణ లభిస్తోందని గేల్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఎనిమిది జట్ల మధ్య అబుదాబి టి10 లీగ్ జనవరి 28నుంచి జరగనుండగా.. క్రిస్ గేల్ అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.