బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) : ఈ విజయాన్ని ఏ విధంగా వర్ణించాలో నాకు తెలియటం లేదు అని భారత కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరి ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. ఫలితం గురించి ఆలోచన లేకుండా, అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అనుకున్నాం. నేను క్రీజులో ఉండగా పుజారా డిఫెన్స్ ఆడితే.. నేను షాట్లు ఆడాలనుకున్నాం. రిషబ్ పంత్, మయాంక్‌లు ఉండటంతో ఆ వ్యూహం బాగుందనుకున్నాం. ఒత్తిడిని పుజారా ఎదుర్కొన్న తీరు అమోఘం. రిషబ్ పంత్ ప్రదర్శన అద్భుతం. జట్టుకు వాషింగ్టన్ సుందర్ సమతూకం తీసుకొచ్చాడు. 20 వికెట్లు కూల్చిన బౌలింగ్ బృందానిదే ఈ గెలుపు ఘనత. ఆడిలైడ్ అనంతరం జరిగిన విషయాలపై చర్చ పెట్టలేదు. మా సహజ శైలిలో ఆడాలని నిర్ణయించుకున్నాం. ఇది జట్టు సమిష్టిగా సాధించిన విజయం.