బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) :నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన. నేను ఆడకపోయినా సహచరులు, సహాయక సిబ్బంది నాకు మద్దతుగా నిలువటం సంతోషం భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఇది నిజంగానే కలల సిరీస్. జట్టు మేనేజ్‌మెంట్ ఎల్లప్పుడూ నావెన్నంటి నిలిచింది. 'నువ్వు మ్యాచ్ విన్నర్‌వు, భారత్‌కు మ్యాచులు గెలిపించగలవు' అని ప్రోత్సహించారు. భారత్‌కు విజయాలు అందించాలని నేను ప్రతి రోజు కలలు కంటాను. ఈ రోజు ఆ కలలను నిజం చేశాను. ఐదో రోజు ఆటలో పిచ్‌పై టర్నింగ్ లభించినా, క్రమశిక్షణతో షాట్ల ఎంపిక చేసుకోవాలని అనుకున్నాను'