Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం
  • ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బౌన్సర్లకు భయపడేవాడిని! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

బౌన్సర్లకు భయపడేవాడిని!

Mon 25 Jan 03:27:20.889583 2021

- యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి జట్టుకు దూరమవటం టీమ్‌ ఇండియాకు పూడ్చలేని లోటని, కానీ అతడు గైర్హాజరీలో ఓ యువ ఆటగాడు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడని క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌, లక్ష్మణ్‌ సహా ఆసీస్‌ మాజీలు వ్యాఖ్యానించారు. దిగ్గజాల మాటలను నిజం చేస్తూ బ్యాటింగ్‌ లైనప్‌లో యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా రాణించాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో అరంగేట్రం చేసిన శుభ్‌మన్‌ గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే అర్థ సెంచరీతో కదం తొక్కాడు. బ్రిస్బేన్‌ టెస్టు ఛేదనలో 91 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలుపు కోసం పోరాడేలా చేశాడు. బ్రిస్బేన్‌లో శుభ్‌మన్‌ గిల్‌పై ఆసీస్‌ పేసర్లు బౌన్సర్ల వర్షం కురిపించారు. ఓ వైపు చతేశ్వర్‌ పుజారా, మరో ఎండ్‌లో గిల్‌లు బౌన్సర్ల దాడికి ఎదురొడ్డి నిలిచారు. ప్రపంచ శ్రేణి పేసర్లు పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోశ్‌ హజిల్‌వుడ్‌ బౌన్సర్ల సునామీని ఎదుర్కొవటంపై శుభ్‌మన్‌ గిల్‌ స్పందించాడు. ' నువ్వు ఎప్పుడైతే బంతికి బలైతావో, నీ భయం అప్పుడే మాయమైతుంది. నీ భయం బంతిని ఎదుర్కొవటం వరకే, ఒక్కసారి ఆ అనుభవం చవిచూస్తే అంతా సాధారణంగా ఉంటుంది. ఇక భయం పూర్తిగా కనుమరుగు అవుతుంది' అని ఐపీఎల్‌ ప్రాంఛైజీ కోల్‌కత నైట్‌రైడర్స్‌ అధికారిక వెబ్‌సైట్‌తో గిల్‌ అన్నాడు. ' నేను కుర్రాడిగా ఉన్నప్పుడు, బౌన్సర్లకు విపరీతంగా భయపడేవా డిని. అందుకే ముందస్తుగా ఛాతి ఎత్తులో వచ్చే బంతులను ఆడుతూ సాధన చేశాను. నేను డ్రైవ్‌ షాట్లు ఎక్కువగా సాధన చేసేవాడిని, అలాగే స్ట్రయిట్‌ బ్యాట్‌తో ఫుల్‌ షాట్‌ ఆడటంలో నేను పరిణితి సాధించాను. నేను కాస్త పక్కకు జరుగుతూ కట్‌ షాట్‌ ఆడటాన్ని సైతం సాధన చేశాను. నేను బౌన్సర్లకు భయపడేవాడిని, అందుకే ఆ లైన్‌లో బంతులను ఆడేందుకు దూరంగా ఉండేవాడిని, అందుకు ప్రతిగా కట్‌ షాట్‌ ఆడేవాడిని. నా చిన్ననాటి నుంచి ఈ 2-3 షాట్లు నా ఫేవరేట్‌. నాకు తొమ్మిదేండ్ల వయసు ఉండగా, నాకంటే ఎక్కువ వయసు గ్రూప్‌ జట్టుతో ఆడాలని చెప్పారు. ప్రతి అకాడమీలో ఉన్నట్టే ఆ అకాడమీలో అత్యంత వేగంగా బంతులు సంధించే ఓ బౌలర్‌ ఉండేవాడు. అతడిని ఎదుర్కొనేందుకు బౌన్సర్లపై భయ పడేవాడిని. అతడు బౌన్సర్‌ వేయగానే నేను డకౌట్‌ అవుతానని ముందే అనుకునేవాడిని. అతడు బౌన్సర్‌ వేసినా, అది వేరే లైన్‌లో వెళ్లిపోయేది. 2-3 బౌండరీలు బాదిన తర్వాత అంతా సాధారణమైపోయేది. నేను చాలా చిన్నవాడిని కావటంతో నా ఆటకు అందరూ ఆశ్చర్యపోయే వారు. అది నాలో ఆత్మవిశ్వాసం పెంపొందేందుకు దోహదం చేసింది. ఆ సంఘటన లెదర్‌ బంతిపై, బౌన్సర్‌పై నాలో ఉన్న అన్ని రకాల భయాలను దూరం చేసింది' అని శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రపంచ శ్రేణి పేసర్లను ఎదుర్కొన్న శుభ్‌మన్‌ గిల్‌ అర్థ సెంచరీ సాధించినా, తక్కువ స్కోరుకే నిష్క్రమించినా.. ఎప్పుడూ క్రీజులో అసౌకర్యంగా కనిపించలేదు. ఎంతో అనుభవం కలిగిన క్రికెటర్‌ మాదిరిగా ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అన్నింటికి మించి, బౌలర్లపై శుభ్‌మన్‌ గిల్‌ సుమారు 90 శాతం నియంత్రణతో పరుగులు సాధించాడు. బ్రిస్బేన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 91 పరుగులు చేసి చారిత్రక విజయంలో ముఖ్య భూమిక వహించిన సంగతి తెలిసిందే.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ముంబయి ఔట్‌?!
త్వరలోనే 'సూపర్‌' సాధన
పిచ్‌లో మార్పు ఉండదు
ఐపీఎల్‌ లో క్రికెట్‌కు విలువ లేదు
మొతెరాలో మరో టర్నర్‌!
మణివి మతిలేని వ్యాఖ్యలు
జట్టులో నమ్మకాన్ని నింపాడు
పిచ్‌ లపై ఎందుకీ ఏడుపు?
రోజర్‌ సరసన జకో
లోపం అక్కడుంది!
ఐపీఎల్‌ మ్యాచులు పెట్టండి
అశ్విన్‌ 3, రోహిత్‌ 8
పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.