Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెవిడ్ వార్నర్ వివరణ
సిడ్నీ : గజ్జల్లో గాయంతో భారత్ తో తొలి రెండు టెస్టులకు దూరమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డెవిడ్ వార్నర్.. తర్వాతి టెస్టుల్లో వంద శాతం ఫిట్నెస్ లేకుండానే ఆడాడు. గజ్జల్లో గాయం నుంచి కోలుకునేందుకు మరో 7-9 నెలల సమయం పడుతుందని డెవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్‌కు వార్నర్ అందుబాటులో ఉండటం లేదని వార్తలొచ్చాయి. దీనిపై వార్నర్ వివరణ ఇచ్చాడు. 'గజ్జల్లో గాయానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంది.. ఆ గాయం బాధ మరికొన్ని నెలలు ఉంటుందని అనుకుంటున్నానని మాత్రమే చెప్పాను. మార్చి 4న న్యూ సౌత్ వేల్స్ తరఫున బరిలోకి దిగుతున్నాను' అని ట్వీట్ చేశాడు.