Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు
  • కోల్‌కతా లక్ష్యం 153
  • పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత
  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!
  • లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
లోపం అక్కడుంది! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

లోపం అక్కడుంది!

Mon 01 Mar 04:35:12.958428 2021

- స్పిన్‌ పై దాడికి అదే తారకమంత్రం
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌
            ఆస్ట్రేలియా పర్యటనలో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో టీమ్‌ ఇండియా విజయ దుంధుబి మోగించింది. కంగారూ గడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు సాధించిన భారత్‌ను ప్రపంచ అగ్రజట్టుగా అందరూ కీర్తించారు. స్వదేశంలో ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు టెస్టుల్లో విజయాలు సాధించిన కోహ్లిసేనకు.. ప్రశంసలు రాకపోగా విమర్శలు ఎదుర్కొంటుంది. భారత పర్యటనలో ఇంగ్లాండ్‌ వైఫల్యానికి స్పిన్‌ పిచ్‌లే కారణమని అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఆసియా జట్లు వేగవంతమైన పిచ్‌లపై ఏ విధంగా మెరుగుపడ్డారో.. నెమ్మదైన పిచ్‌లపై రాణించేందుకు ఇతర జట్లూ అదే రీతిలో కష్టపడాలని చాపెల్‌ పరోక్షంగా పేర్కొన్నాడు. స్పిన్‌ ఆడేందుకు ఇంగ్లాండ్‌ అనుసరిస్తున్న వ్యూహంపై చాపెల్‌ ఓ వ్యాసంలో సద్విమర్శ చేశాడు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఆసియా జట్లపై విజయాలు సాధించినప్పుడు ఆటగాళ్ల ప్రదర్శనలను కొండంత చేసి చూపించటం.. ఆసియా జట్ల చేతిలో ఓడినప్పుడు సాకులు వెతికి మరీ విమర్శలు చేయటం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో ఆస్ట్రేలియా ఇప్పుడిప్పుడే మార్పు దిశగా పయనిస్తోంది. కానీ ఇంగ్లాండ్‌ మాత్రం ఇప్పటికీ పాత పంథాలోనే ప్రతిదాడి చేసి, ప్రత్యర్థి విజయాన్ని తక్కువ చేసి చూపించే కునసుతోనే ప్రవర్తిస్తోంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ప్రస్తుత భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌. అజేయంగా కనిపించిన భారత్‌ను చెపాక్‌ స్పిన్‌ ట్రాక్‌పై ఇంగ్లాండ్‌ తొలి టెస్టులో ఓడించింది. చెన్నై తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ విజయాన్ని ఆ దేశ మీడియా, మాజీ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తారు. చెన్నైలో రెండో టెస్టు, అహ్మదాబాద్‌లో మూడో టెస్టు సైతం స్పిన్‌ అనకూల పిచ్‌లే. అక్కడ ఇంగ్లాండ్‌ దారుణంగా ఓడింది. తొలి టెస్టులో భారత స్పిన్నర్లపై పైచేయి సాధించిన ఇంగ్లాండ్‌ను 'బాహుబలి'గా చూపించారు. తర్వాతి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టు విజయం సాధించేసరికి 'పిచ్‌లను' విలన్లుగా చూపిస్తున్నారు. టెస్టు క్రికెట్‌ పిచ్‌లు బంతికి, బ్యాట్‌కు పోటీతత్వం సమతూకంగా ఉండటంతో పాటు ఐదు రోజుల్లో ఫలితం తేలేందుకు అనువుగా ఉండాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటారు. పిచ్‌లపై పారదర్శకత కేవలం ఆసియా దేశాల్లోనే ఉండాలని భావించే వారు చేసే విమర్శలకు ఇప్పుడు విలువ లభించటం లేదు. అక్కరకురాని విమర్శలు మానివేసి, స్పిన్‌పై పైచేయి సాధించటంపై దృష్టి నిలుపటం ఆ జట్లకు మేలు చేస్తుంది. భారత పర్యటనలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌పై స్వీప్‌ షాట్‌ను బ్రహ్మాస్త్రంగా వాడుతున్నారు. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ మాయ ముందు ఆ అస్త్రం వాడిపోయింది. స్పిన్‌ను ఎదుర్కొవటంలో ఇంగ్లాండ్‌ అనుసరిస్తున్న వ్యూహంలో లోపాలను ఎత్తిచూపుతూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌ రాసిన వ్యాసంలో వివరించాడు.
ఇంగ్లాండ్‌ భయపడింది!
స్పిన్‌ను అనుకూలించే పిచ్‌లపై ప్రతికూల తలను అనుకూలంగా మలచుకోవటం ప్రధాన నియమం. స్పిన్‌ స్వర్గధామ పిచ్‌పై ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ తమ డిఫెన్స్‌పై నమ్మకం ఉంచలేదు. స్పిన్‌ను ఎదుర్కొవటంలో నెలకొన్న భయంతోనే స్పిన్నర్లపై క్రీజులో ఉండి ఎదురుదాడి చేశారు. స్పిన్నర్లు తమ బౌలింగ్‌ లెంగ్త్‌లు మార్చుకునేందుకు బ్యాట్స్‌మెన్‌ క్రీజు వదిలి బయటకు వచ్చి షాట్లు ఆడాలి. ఆ పని ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ చేయలేదు. దీంతో భారత స్పిన్నర్లు అనువైన చోట బంతులు వేసి మాయజాలం ప్రదర్శించారు. క్రీజులో నిలబడి షాట్లు ఆడటం, స్వీప్‌ షాట్లతో నాణ్యమైన స్పిన్నర్‌ను ఆత్మరక్షణలో పడేయలేము. 2000-01 సిరీస్‌లో భారత బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ 281 పరుగులు చేశాడు. అప్పుడు షేన్‌ వార్న్‌ 'నేనేమీ చెత్తగా బౌలింగ్‌ చేయలేదు' అన్నాడు. బ్యాట్స్‌మెన్‌ క్రీజు వదిలి బయటకు వచ్చిన ఆడుతూ లెంగ్త్‌లు మార్పు చేసుకునేందుకు ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు బ్యాక్‌ఫుట్‌పై ఆడుతూ సులువుగా పరుగులు పిండుకుంటారు. ఈడెన్‌గార్డెన్స్‌లో షేన్‌ వార్న్‌ బౌలింగ్‌ బాగా చేసినా.. లక్ష్మణ్‌ గొప్ప ఫుట్‌వర్క్‌తో అతడిపై పైచేయి సాధించాడు.
ఫుట్‌వర్క్‌తో స్పిన్‌ను సులువుగా ఎదుర్కొవటమే కాదు, స్పిన్నర్‌ వేయాలనుకున్న లెంగ్త్‌లను వదిలేసి.. బ్యాట్స్‌మెన్‌ కోరుకున్న లెంగ్త్‌లో బంతులు వేసేందుకు తప్పని పరిస్థితి కల్పిస్తాడు. కెరీర్‌ ఆరంభంలోనే నేర్చుకునే నైపుణ్య కళ ఇది. దురదృష్టశావతు ఇంగ్లాండ్‌ క్రికెట్‌లో కనిపించదు. స్పిన్‌పై ఎదురుదాడికి స్వీప్‌ షాట్‌ను అక్కడ ఆయుధంగా నేర్పిస్తారు. ఇంగ్లాండ్‌ అనుసరిస్తున్న ఈ వ్యూహంలో ఆన్‌ సైడ్‌లో పరుగులు చేసే అవకాశమే ఉండదు. వికెట్‌ కోల్పోయే అవకాశాలు తగ్గించుకోవటం చూస్తున్నారు కానీ, పరుగులు సులువుగా రాబట్టే వ్యూహం కాదది. స్వీప్‌ షాట్లతో లెగ్‌ స్లిప్స్‌లో క్యాచులకు సైతం అవకాశాలు ఉంటాయి. గొప్ప ఫుట్‌వర్క్‌తో స్పిన్నర్లపై పైచేయి సాధించిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ డౌగ్‌ ఆల్టర్‌. లాన్సె గిబ్స్‌ క్లబ్‌పై క్వీన్‌పార్క్‌ ఓవల్‌లో ఓ సెషన్లోనే అతడు సెంచరీ సాధించాడు. మహా మాయగాడు ఎర్రపల్లి ప్రసన్నపై చెపాక్‌లో శతకం బాదాడు. అతడి తర్వాతి కాలంలో ఇంగ్లాండ్‌ ఫుట్‌వర్క్‌పై సాధన మానివేసి స్వీప్‌ షాట్లపై శ్రద్ధ చూపిస్తుంది.
చెన్నైతో పాటు అహ్మదాబాద్‌ టెస్టుల్లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే. మొతెరా పిచ్‌పై ఇంగ్లీష్‌ యువ బ్యాట్స్‌మన్‌ ఒలీ పోప్‌ భిన్నమైన ప్రణాళికలతో వచ్చాడు. స్పిన్‌ పిచ్‌పై స్పిన్నర్లను క్రీజు వదిలి ఆడాలనే అతడి ఉద్దేశం సరైనది, కానీ అతడు ఎంచుకున్న మార్గం కాదు. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లపై క్రీజు వదిలి ముందుకొచ్చే ఆడేందుకు ప్రయత్నించిన ఒలీ పోప్‌.. అదే సమయంలో వికెట్‌ కీపర్‌ ఫోబి యాను వదులుకోలేదు. స్టంపౌట్‌ అవుతాననే భయంతో వెనకాలి కాలును క్రీజులోనే నిలిపేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుకున్నట్టు క్రీజు వదిలి ధైర్యంగా ఆడేందుకు అవకాశం చిక్కలేదు. స్పిన్నర్లపై ఎదురుదాడి చేయాలనుకున్నప్పుడు వెనకాల వికెట్‌ కీపర్‌ను మరిచిపోవాలి. అప్పుడే స్పిన్నర్లను లెంగ్త్‌లు మార్పు చేసుకునేలా చేయగలం. స్పిన్నర్లు లెంగ్త్‌లు మార్పు చేసుకుంటే.. క్రీజులో ఉండే బ్యాక్‌ఫుట్‌తో సులువుగా ఆడవచ్చు. స్పిన్‌ పిచ్‌లపై స్పిన్నర్లను ఎదుర్కొవటం అంత సులువు కాదు. కానీ స్పిన్నర్లను సులువుగా ఆడేందుకు మంచి అవకాశమైతే ఉంది. ఇంగ్లాండ్‌కు ఆ పని చేయటంపై ఆలోచన లేన్నట్టు ఉంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శాంసన్‌ శతకబాదినా
హుడా ఉప్పెన
ముంబయి బోణీ కొట్టేనా?
మళ్లీ మూడు జట్లతోనే!
ఒలింపిక్స్‌ ఇప్పుడొద్దు!
ఇద్దరు కోచ్‌లకు పాజిటివ్‌
అవే కుమ్ములాటలు!
కోల్‌కత బోణీ
పంజాబ్‌తో రాయల్స్ ఢీ
ధోనీపై ద్రవిడ్‌ ఆగ్రహం
మహీకి మరో షాక్‌
ధావన్‌, షా ధనాధన్‌
అంబుడ్స్‌మన్‌పై ఇప్పుడెలా?
సన్‌రైజర్స్‌ మెరిసేనా?
టోక్యోకు అన్షు, సోనమ్‌
హర్షల్‌ ఎక్స్‌ప్రెస్‌
బుడగ బతుకులు
ధోనీతో పంత్‌ ఢీ
ఐపీఎల్‌ హంగామా
కోహ్లి వర్సెస్‌ రోహిత్‌
టోక్యోకు నలుగురు సెయిలర్లు
ఆస్ప్రతి నుంచి ఇంటికి..
అయ్యర్‌ కు శస్త్రచికిత్స
మహీ ముగింపు అదిరేనా?
టీ20 ప్రపంచకప్‌ జట్టుపై కన్నేసి..
త్వరలోనే క్రమబద్దీకరిస్తాం
తెలంగాణ క్రికెట్‌కు గుర్తింపు దక్కేనా?
ప్రపంచ కప్‌ కు ప్లాన్‌-బి!
హ్యాట్రిక్‌ కు ఎదురుందా?
మన క్రికెటర్లు సహనశీలురు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.