Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 310 వారాలు అగ్రస్థానంలోనే...
దుబాయ్ : ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 310 వారాలు అగ్రస్థానంలో కొనసాగుతున్న సెర్బియాస్టార్ నొవాక్ జకోవిచ్ మరో రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. టెన్నిస్ దిగ్గజం, స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 310 వారాలు వరల్డ్ నం.1గా కొనసాగాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తొమ్మిదోసారి సొంతం చేసుకున్న జకోవిచ్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. వచ్చే వారంలో వరల్డ్ నం.1గా 311వ వారం ముగించుకోనున్న జకోవిచ్.. స్విస్ యోధుడిని అధిగమించనున్నాడు. 2020 ఫిబ్రవరిలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చి.. వరల్డ్ నం.1గా కొనసాగుతున్నాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో వరుసగా అత్యధిక వారాలు అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడిగా రోజర్ ఫెడరర్ రికార్డు (237 వారాలు) పదిలంగానే ఉంది. జకోవిచ్, ఫెడరర్ తర్వాతి స్థానాల్లో పీట్ సంప్రాస్ (286), ఇవాన్ లెండ్లి (270), జిమ్మీ కాన్నర్స్ (268) ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం వరల్డ్ నం.1గా నిలిచిన టాప్-5లో కొనసాగుతున్నారు.