Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీరన్ పొలార్డ్ విధ్వంసక ఇన్నింగ్స్
- శ్రీలంకపై వెస్టిండీస్ ఘన విజయం
ఆంటిగ్వా : రెండు ఓవర్లలోనే అఖిల ధనంజయ విచిత్రమైన అనుభవం చవిచూశాడు. వెస్టిండీస్‌పై వేసిన రెండో ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు కూల్చిన యువ స్పిన్నర్.. తానేసిన మూడో ఓవర్లో ఏకంగా ఆరు సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో భిన్నమైన రికార్డులు సాధించాడు. కరీబియన్ విధ్వంసకారుడు కీరన్ పొలార్డ్ (38, 11 బంతుల్లో 6 సిక్స్‌లు) ధనంజయపై శివమెత్తాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదేశాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌పై యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగా... ఇప్పుడు శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయపై విరుచుకుపడ్డాడు. అంతకముందు ఎవిన్ లెవిస్ (28), క్రిస్ గేల్ (0), నికోలస్ పూరన్ (0)లు అఖిలకు వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయారు. తొలి టీ20లో శ్రీలంక 131/9 పరుగులు చేసింది. వెస్టిండీస్ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల హీరో పొలార్డ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.