Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోచి : సొంత మైదానంలో కేరళ బ్లాస్టర్స్ మరోసారి నిరాశ పరిచింది. ఢిల్లీ డైనమోస్‌తో హోమ్ మ్యాచ్‌లో బ్లాస్లర్స్ 0-1తో ఓట మి పాలయ్యింది. ఢిల్లీ డైనమోస్ ఫార్వర్డ్ గాడ్డే (ఘనా) 87వ నిమి షంలో గోల్ కొట్టి పర్యాటక జట్టుకు విజయం అందించాడు. ఢిల్లీ డైన మోస్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా... కేరళకు ఇది రెండో ఓటమి. ఢిల్లీ డైనమోస్ విజయ యాత్ర కొనసాగించింది. ప్రథమార్థంలో గోల్ లేకుండానే ముగించిన కేరళ, ఢిల్లీ జట్లు..ద్వితియార్థంలో గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఉత్సాహపరిచినా..కేరళ గోల్ చేయలేకపోయింది. 43వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గాడ్జే సెకండ్ హాఫ్‌లో సత్తా చాటాడు. 87వ నిమిషంలో ఫీల్డ్ గోల్‌తో ఢల్లిీకి విజయాన్ని అందించాడు. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానానికి చేరింది.