Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో పోరాడి ఓడిన సింధు
- ఒలింపిక్ చాంప్ లీ జురేరుదే టైటిల్
కెరీర్ మేడిన్ ప్రీమియర్ టైటిల్‌పై కన్నేసిన సింధుకు ఫైనల్లో భంగపాటు. ఒలింపిక్ చాంప్, చైనా షట్లర్ లీ జురేరుతో జరిగిన టైటిల్ పోరులో సింధు పోరాడి ఓడింది. గాయాల నుంచి కోలుకున్న తర్వాత గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సింధు.. సూపర్ టైటిల్ మిస్సయినా.. సూపర్ సింధు అనిపించుకుంది.
ఒడెన్సె: సింధు సూపర్ స్వప్నం చెదిరింది. కెరీర్ తొలి ప్రీమియర్ టైటిల్ వేటకు చైనా చిన్నది బ్రేక్ వేసింది. తొలి సూపర్ సిరీస్ ఫైనల్స్ ఆడిన తెలుగు తేజం.. రన్నరప్ ట్రోఫీని సరిపెట్టుకుంది. ఒలింపిక్ చాంపియన్ లీ జురేరు (చైనా) సింధుపై 21-19, 21-12తో వరుస సెట్లలో విజయం సాధించి డెన్మార్క్ ఓపెన్‌ను దక్కించుకుంది. ఫైనల్స్‌లో లీ జురేరుకు గట్టి పోటీనిచ్చిన సింధు కీలక సమయంలో మ్యాచ్ పట్టు కోల్పోయి..కప్ చేజార్చుకుంది. గాయాల నుంచి ఇటీవలే కోలుకున్న సింధు..డెన్మార్క్ ఓపెన్‌లో ఫైనల్స్‌కు చేరి గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన ్షిప్స్లో వరుసగా రెండు కాంస్యాలు నెగ్గి.. చరిత్ర సృష్టించిన పి.వి.సింధు ఇప్పటివరకూ ఒక్క ప్రీమియర్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గకపోవటం ఆశ్చర్యకరం.
పోరాడినా..: కెరీర్లో తొలిసారి ప్రీమియర్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన తెలుగు తేజం పి.వి.సింధు..ఆరంభంలో ఒలింపిక్ చాంప్కు ధీటుగా రాణించింది. వరుస సెట్లలో ఓడినా.. ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. తొలి సెట్‌ను సొంతం చేసుకునేలా కనిపించిన సింధు..ఆఖర్లో తడబాటుకు లోనై.. ఆధిక్యాన్ని కోల్పోయింది. ఫస్ట్ సెట్ ఆరంభంలో సైనా, లీ పోటాపోటీగా పాయింట్లు సాధించారు. 6-6, 8-8తో సమవుజ్జీలు నిలిచారు. వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు 10-8తో ముందంజ వేసింది. ఐతే బ్రేక్ టైమ్‌కు 11-10తో లీ రేసులోకి దూసుకొచ్చింది. సెకండ్ హాఫ్ ఆట పూర్తి భిన్నంగా సాగింది. వరుసగా ఆరు పాయింట్లు కొల్లగొట్టిన చైనా చిన్నది 16-10తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. వేగంగా పుంజుకున్న సింధు 17-17తో స్కోరు సమం చేసి మళ్లీ రేసులోకి వచ్చింది. కానీ ఆఖర్లో కీలక మ్యాచ్ పాయింట్ సాధించేసిన లీ జురేరు తొలి సెట్‌ను 21-19తో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన రెండో సెట్లో సింధు నిరాశపరిచింది. సెట్లో ఏ దశలోనూ లీకి పోటీనివ్వలేదు. 1-6, 3-8, 3-11తో విరామ సమ యానికే సింధు దాదాపుగా చేతులెత్తేసింది. సెకండ్ హాఫ్‌లో పుంజుకుంటుందని భావించినా... సుదీర్ఘ ర్యాలీల్లో సింధు ఆధిపత్యం చెలాయించ లేక పోయింది. వరుసగా విన్నర్లు పాయింట్ల అంతరాన్ని 11-16తో తగ్గించినా..సెట్‌ను కాపాడు కోవటానికి ఉపయోగపడలేదు. దీంతో 21-12తో లీ జురేరు విజ యం సాధించి.. డెన్మార్క్ చాంపి యన్‌గా నిలిచింది. 47 నిమి షాల్లోనే ముగిసిన టైటిల్ పోరులో సింధు 31 పాయింట్లు సాధిం చగా.. లీ జురేరు 42 పాయింటు ఖాతాలో వేసుకుంది.