Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ సెమీస్‌లో చెమటోడ్చిన వరల్డ్ నెం.1
- లేడీస్ కప్ టోర్నీ
సెయింట్ పీటర్స్బర్గ్ (రష్యా) : డబ్ల్యూటీఏ సర్క్యూట్లో వరల్డ్ నెం.1 సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ మరో టైటిల్ పోరుకు సిద్ధమైంది. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ కొల్లగొట్టిన తెలంగాణ బ్రాండ్అంబాసీడర్..రష్యాలోనూ సత్తా చాటుతోంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ స్పెయిన్ జంటపై 2-1తో నెగ్గిన సానియా, హింగిస్ ఫైనల్లో అడుగుపెట్టారు. మూడు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన సెమీస్‌లో 7-5, 6-7(6-8), 10-6తో సానియా జోడీ.. మడిన, శాంటోజాలపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 7-5తో నెగ్గిన టాప్ సీడ్స్‌కు.. తర్వాతి సెట్లో స్పెయిన్ భామలు షాకిచ్చారు. రెండో సెట్లో 0-3తో వెనుకంజలో నిలిచిన సాన్‌టినా 3-4తో పుంజుకున్నా.. టైబ్రేకర్‌లో 6-8తో స్పెయిన్ జోడీ పైచేయి సాధించింది. నిర్ణయాక మూడో సెట్లోనూ మడిన, శాంటోజాలు తీవ్రంగా పోరాడినా.. సూపర్ టైబ్రేకర్‌లో 10-6తో ఆధిక్యం సాధించిన సాన్‌టినా మూడో సెట్‌ను, ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్ఫైనల్లో రష్యా జోడీ కసట్కినా, వెస్నినాలపై 6-4, 6-1తో సానియా, హింగిస్లు వరుస సెట్లలో అలవోకగా గెలు పొందారు. స్పెయిన్ జోడీపై సెమీస్‌లో సాధించిన విజయం సాన్‌టినా జోడీకి వరుసగా 39వ గెలుపు కావటం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లోనూ సాని యా, హింగిస్ నెగ్గితే ట్రోఫీతో పాటు 40వ వరుస విజయాన్ని అందుకోనుంది.