Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా 40వ విజయం నమోదు
సెయింట్ పీటర్స్బర్గ్: అదే హౌరు.. రెట్టించిన జోరు.. వరుస విజ యాలు.. వరుస టైటిల్స్ ఇదీ డబ్లూటీఏ సర్క్యూట్లో తెలం గాణ బ్రాండ్అంబా సీడర్ సాని యా మీర్జా ప్రస్థానం. స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్ జత గా దుమ్ము రేపుతోన్న సానియా మీర్జా.. ఈ ఏడాది ముచ్చటగా మూడో ట్రోఫీని దక్కించు కుంది. సెయింట్‌పీటర్స్‌బర్గ్ లేడీస్ కప్ టోర్నీలోనూ జైత్రయాత్ర కొనసాగించిన సానియా, హింగిస్ రష్యాలోనూ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో అన్సీడెన్ అమ్మాయిలపై జయకేతనం ఎగురవేసిన సాన్‌టినా.. రికార్డు స్థాయిలో వరుసగా 40వ విజ యంతో పాటు జంటగా 13వ ట్రోఫీని సొంతం చేసుకున్నారు.నాకౌట్ మ్యాచుల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్న వరల్డ్ నెం.1 సాన్‌టినా టైటిల్ పోరులో రెచ్చి పోయింది. వెర దుశెవిన (రష్యా), బార్బోర క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై సాన్‌టినా 6-3, 6-1తో వరుస సెట్లలో గెలుపొందింది. తొలి సెట్ నుంచే ఆధిపత్యం చెలాయించిన సానియా జోడీ.. ఆ సెట్‌ను 6-3తో సొంతం చేసుకుంది. రెండో సెట్లో మాత్రం అత్యంత ఏకపక్షంగా నెగ్గింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని సానియా, హింగిస్ 4-0తో దూసు కెళ్లారు. ఆఖర్లో ఒక పాయింట్ దక్కించు కున్న రష్యా, చెక్ జోడీ 1-6తో ఓటమి అంతరాన్ని తగ్గించుకుంది. క్వార్టర్స్, సెమీస్‌లో ప్రత్యర్థులకు సెట్ కోల్పోయిన సానియా, హింగిస్ జోడీ ఫైనల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది.