Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిఫా (అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య) ప్రెసిడెంట్గా రాజీనామా చేసిన సెప్ బ్లాటర్ స్థానాన్ని అర్జెంటీనా మాజీ ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా భర్తీ చేయాలని కోరుకుం టున్నట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం అవినీతి ఆరోపణల వల్ల ఫిఫా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన నాలుగు రోజులకే సెప్ బ్లాటర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఫిఫా అధ్యక్షుడిగా డిగో మారడోనాను తీసుకోవాల్సిందిగా సూచించాడు. అయితే డిసెంబర్ వరకు ఫిఫా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే అవకాశం లేనందున మారడోనా అధ్యక్ష్య పదవికి అలంకరించడానికి తెర వెనుక అవసరమైన కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని నిజం చేస్తూ ఉరుగ్వే జర్నలిస్టు విక్టర్ హూగో మార్లస్ 'నాకిచ్చిన ఇంటర్య్వూలో మారడోనా ఫిఫా అధ్యక్ష్య పదవికి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు' అని ట్విటర్లో వెల్లడించాడు.