Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-హాకీ ఇండియా జట్టు కోచ్‌గా నియామకం
-మహిళల జట్టుకు హై పర్ఫార్మెన్స్ స్పెషలిస్ట్‌గా హరేంద్ర సింగ్
న్యూఢిల్లీ : హాకీ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. స్వల్పకాలిక ఫలితాలు రాబట్టడంలో విఫలమవుతున్నాడన్న సాకుతో ఓల్ట్‌మన్స్‌కు వేటు వేసిన హెచ్ఐ.. తాజాగా భారత జట్టుకు కోచ్‌గా ష్జార్డ్ మార్జేన్ను నియమించింది. నూతన క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ రాథోర్ తన అధికారిక ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. దీంతో కోచ్ కావాలంటూ వెబ్సైట్లో పెట్టిన ప్రకటనను హెచ్ఐ తొలగించింది. మార్జేన్ ప్రస్తుతం మహిళల జట్టుతో యూరప్ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 20న మార్జేన్ కొత్త భాద్యతలు చేపట్టనున్నారు. కాగా పురుషుల జట్టు భాద్యతలు తీసుకోవడం ఆయనకిదే తొలిసారి. సీనియర్ మహిళల జట్టుకు హై పర్ఫార్ మెన్స్ స్పెషలిస్ట్‌గా హరేంద్ర సింగ్ నియమి తులయ్యారు. గతంలో జాతీయ జట్టును నడిపించిన హరేంద్ర.. ప్రస్తుతం జూని యర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన శిక్షణలో జూనియర్ జట్టు నిరుడు వరల్డ్ కప్ సాధించింది. నేడు హరేంద్ర భాద్యతలు తీసుకోనున్నారు.