Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీస్×స్టీఫెన్స్
- సెమీస్‌లో ఓడిన వీనస్, వాండవేగె
యు.ఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌కు మళ్లీ కొత్త చాంపియన్ రాబోతుంది. వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్, కొకొ వాండవేగెలు సెమీస్‌లోనే నిష్క్రమించారు. యువ సంచనలం స్లోనె స్టీఫెన్స్, మడిసన్ కీస్‌లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కీస్, స్టీఫెన్స్లకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్. వీనస్‌తో హోరాహోరీ పోరులో స్టీఫెన్స్ నెగ్గగా, కొకొను చిత్తుగా కొట్టి కీస్ ఫైనల్లోకి చేరుకున్నది. నేడు జరిగే ఫైనల్లో కీస్, స్టీఫెన్స్లలో ఎవరు నెగ్గినా చరిత్రే!.
నవతెలంగాణ-న్యూయార్క్
2003 తర్వాత అమెరికా తరఫున విలియమ్స్ సిస్టర్ మినహా మరేవ్వరూ ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి అడుగుపెట్టలేదు. ఓ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్స్‌లో ఇద్దరు నల్ల కలువలు తలపడుతున్నారంటే, అది కచ్చితంగా విలియమ్స్ సిస్టర్సే.కానీ శుక్రవారం నాటి సెమీఫైనల్లో అభిమానులకు విభిన్నమైన అనుభూతి. అన్ సీడెడ్‌గా యు.ఎస్ ఓపెన్‌లోకి అడుగుపెట్టిన 24 ఏండ్ల స్లోనె స్టీఫెన్స్.. సంచలన ఆట తీరుతో ఫైనల్లోకి దూసుకొచ్చింది. సెమీఫైనల్లో అమెరికా వెటరన్ క్రీడాకారిణీ, తాజా వింబుల్డన్ చాంపియన్ వీనస్ విలియమ్స్‌తో హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన స్టీఫెన్స్ కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్‌కు అడుగు దూరంలో నిలిచింది. 6-1, 0-6, 7-5తో వీనస్ విలియమ్స్‌ను మారథాన్ మ్యాచ్‌లో ఓడించిన స్టీఫెన్స్ తొలి సారి మేజర్ టోర్నీ టైటిల్ పోరులో అదృష్టం పరీక్షించుకో నున్నది. మరో ఆల్ అమెరికా వుమెన్ సెమీఫైనల్లో మడిసన్ కీస్ అలవోక విజయం సాధించింది. సహచర క్రీడాకారిణీ కొకొ వాండవేగెను 6-1, 6-2తో వరుస సెట్లలో మట్టికరిపించిన మడిసన్ టైటిల్ పోరుకు సై అంటోంది. 20వ సీడ్ కీస్ 66 నిమిషాల్లోనే కొకొను కొట్టేసింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో స్లోనె స్టీఫెన్స్‌తో మడిసన్ కీస్ అమీతుమీ తేల్చుకోనున్నది. కీస్, స్టీఫెన్స్లకు ఇద్దరికీ ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ కావటంతో బిగ్ ఫైట్‌పై ఉత్కంఠ నెలకొన్నది. మడిసన్ కీస్, స్లొన్ స్టీఫెన్స్లలో ఎవరు నెగ్గినా న్యూయార్క్‌కు కొత్త సింగిల్స్ క్వీన్‌తో పాటు వారికి కెరీర్లో తొలి మేజర్ ట్రోఫీ దక్కనున్నది.
సూపర్ స్టీఫెన్స్ : ఆల్ అమెరికన్ ఉమెన్స్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది స్లొనె స్టీఫెన్స్. సీనియర్ క్రీడాకారిణీ, వింబుల్డన్ విజయం జోరుమీదున్న వీనస్ విలియమ్స్‌ను ఓడించిన స్టీఫెన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే, స్టీఫెన్స్కు విజయం అంత సులభంగా దక్కలేదు. తొలి సెట్లో 6-1తో మెరిసినా వీనస్‌ను అడ్డుకోలేకపోయింది. ఏడు గేమ్ పాయింట్లలో వీనస్ ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకున్నది. కానీ రెండో సెట్లో పుంజుకున్న వీనస్ విలియమ్స్ 6-0తో ఏకపక్షంగా సెట్‌ను సాధించింది. ఈ సెట్లో స్టీఫెన్స్ ఒక్క పాయింట్ కూడా సాధించలేక పోయింది. 1-1తో ఫైనల్స్ బెర్త్ రేసును మూడో సెట్‌కు దారితీసింది. నిర్ణయాత్మక సెట్లోనూ స్టీఫెన్స్ జోరు తగ్గలేదు. తొలి గేమ్‌లోనే వీనస్ సర్వ్ బ్రేక్ చేసి 2-0తో ముందుకెళ్లింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించిన వీనస్ 3-2తో ముందంజ వేసింది. ఈ దశలో నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో 4-4, 5-5తో సమవుజ్జీలుగా నిలిచారు. ఆఖర్లో వరుస పాయింట్లు సొంతం చేసుకున్న స్టీఫెన్స్ 7-5తో మూడో సెట్‌ను, ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకున్నది. రెండు ఏస్‌లే సంధించినా, వీనస్ 51 అనవసర తప్పిదాలు చేసేలా చేసింది స్టీఫెన్స్. ఇక మరో సెమీఫైనల్లో మడిసన్ కీస్ అలవోకగా గెలుపొందింది. 6-1, 6-2తో కొకొను చిత్తుగా ఓడించింది. ఐదు ఏస్‌లు సంధించిన కీస్, 25 విన్నర్లు సాధించింది. ఇదే సమయంలో వాండవేగె 22 అనవసర తప్పిదాలు ఆమె అవకాశాలను తీవ్రంగా దెబ్బకొట్టాయి.
నిజానికి నాకు ఎలాంటి అంచనాలు లేవు. కేవలం ఇక్కడ ఆడాలనుకున్నా, ఏం జరుగుతుందో నేనూ చూడాలనుకున్నా. నేను ఆడాను, ఇదీ జరిగింది'
- స్లోన్ స్టీఫెన్స్