Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ పోరులో నడాల్, అండర్సన్
- సెమీస్‌లో బుస్టా, డెల్ వెనుకంజ
- డెల్ పోట్రో, పాబ్లో బుస్టాలు సెమీస్ పోరులో చేతులెత్తేశారు.
డెల్ రెండో గ్రాండ్‌స్లామ్ ఆశలకు స్పెయిన్ బుల్ నడాల్ కళ్లెం వేశాడు. మూడో సారి యుఎస్ ఓపెన్ దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. తొలి గ్రాండ్ స్లామ్ కలలతో సెమీస్ చేరిన బుస్టా, అండర్సన్ హోరాహోరీగా తలపడ్డారు. సెమీ సమరంలో బుస్టాను అడ్డుకున్న అండర్సన్ టైటిల్ పోరులో నడాల్ని సైతం ఓడించి చరిత్ర సృష్టిస్తాడా.. వేచి చూడాల్సిందే!.
నవతెలంగాణ న్యూయార్క్
దిగ్గజ ఆటగాడు ఫెడరర్‌ను సైతం వెనక్కు నెట్టి సెమీస్ చేరిన డెల్ పోట్రో..గతాన్ని పునరావృతం చేస్తాడ నుకున్నారంతా. అయితే సెమీస్ సమరంలో లో స్పెయిన్ బుల్ ఢకొీట్టడంతో డెల్ ఇంటిముఖం పట్టాడు. 4-6, 6-0, 6-3, 6-2తో డెల్ పోట్రోని మట్టికరి పించిన నడాల్ అలవోకగా ఫైనల్ చేరాడు. మరో పక్క తొలి గ్రాండ్ స్లామ్ కలలతో పాబ్లో కారెనో బుస్టా, కెవిన్ అండ ర్సన్లు సెమీస్‌లో అడుగు పెట్టారు. ఇద్దరూ తొలిసారి సెమీస్ చేరడంతో హోరాహోరీ పోరు జరిగింది. బుస్టా దూకుడుకు 4-6, 7-5, 6-3, 6-4తో అడ్డుకట్ట వేసిన అండర్సన్ అనూహ్యంగా ఫైనల్లో చోటు సంపాందించాడు. ఒకవేళ నడాల్‌పై అండర్సన్ గెలిస్తే తన తొలి కెరీర్ మేజర్ టైటిల్ దక్కించుకోనున్నాడు.
రఫ్పాడించిన రఫా : గడిచిన రెండేళ్లలో ఒక్క గ్రాండ్‌స్లామ్ పోరూ నెగ్గని నడాల్ ఈ ఏడు ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో జోరు మీదున్నాడు. పది సార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి రికార్డు సృష్టించాడు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగాడు. క్వార్టర్స్‌లోనే స్విస్ దిగ్గజం ఫెడరర్‌ను కంగుతినిపించిన అర్జెంటీనా ఆటగాడు డెల్ పోట్రోను సెమీస్ బరిలో నడాల్ ఓడించాడు. రెండున్నర గంటలు సాగిన నాల్గు సెట్ల పోరులో తొలిసెట్ ను 6-4తో నెగ్గి డెల్ సవాలు విసిరాడు. అరగంటలోపే ముగిసిన తదుపరి సెట్లో విజృంభించిన నడాల్ 6-0తో ఏకపక్షంగా సెట్ గెల్చుకున్నాడు. తనవైన ఫోర్ విన్నర్లతో విరుచుకుపడిన నడాల్ 3-0తో నిల్చి మూడో సెట్ సైతం ఏకపక్షం చేశాడు. నడాల్ అనవసర తప్పిదాలతో పుంజుకున్న డెల్ 2-4తో నిలిచాడు. ఫోర్ హ్యాండ్ స్మాష్ విన్నర్‌తో మూడో సెట్ గెల్చిన నడాల్ మరో సెట్ 6-2తో నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయిదు ఏస్‌లు సంధించిన నడాల్, 45 విన్నర్లతో ఆకట్టుకున్నాడు. రెండు డబుల్ ఫాల్ట్స్ సహా 20 అనవసర తప్పిదాలు చేశాడు. మొత్తంగా 33 పాయింట్ల ఆధిక్యం ప్రదర్శించాడు.
అదరహో అండర్సన్ : ఆండీ ముర్రే టోర్నీలో లేకపోవడంతో 28వ సీడ్ కెవిన్ అండర్సన్ (ద.ఆఫ్రికా)కు డ్రా కలిసొచ్చింది. 2015 యుఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్ దాకా వచ్చి వెనుదిరిగిన అండర్సన్ ఆదివారం జరగనున్న టైటిల్ బ్యాటిల్లో నడాల్‌ను ఢకొీననున్నాడు. అయితే సెమీస్‌లో అతనికేమీ అలవోక విజయం దక్కలేదు. 12వ సీడ్ స్పెయిన్ కెరటం పాబ్లో బుస్టా గట్టి పోటీనిచ్చాడు. తొలి సెట్లో ఆరో గేమ్ వద్ద ఇరువురు సమంగా నిలిచినా.. 6-4తో బుస్టా తొలి సెట్ నెగ్గాడు. అతడి దూకుడు చూస్తే అండర్సన్‌ను ఓడించేలా కనిపించాడు. ఇక రెండో సెట్లో పదో గేమ్ వద్ద 5-5తో మళ్లీ స్కోరు సమం కావడంతో మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తించింది. అద్భుతమైన ఏస్‌తో ఓ గేమ్, బ్యాక్ హ్యాండ్ విన్నర్‌తో మరో గేమ్ గెల్చిన అండర్సన్ రెండో సెట్ కైవసం చేసుకున్నాడు. మూడో సెట్లో మూడు గేముల ఆధిక్యం కనబరచిన అండర్సన్ అదే ఆధిక్యంతో చివరిదాకి ఆడి సెట్ బుట్టలో వేసుకున్నాడు. ఆఖరు సెట్లో నువ్వానేనా అన్నట్టు తలపడినా.. బుస్టా వరుస తప్పిదాలు అండర్సన్‌కు వరంగా మారాయి. దీంతో ఫైనల్ బెర్త్ అండర్సన్ సొంతమైంది. బుస్టా ఒకే ఒక్క ఏస్ సంధించగా.. అండర్సన్ 22 ఏస్‌లతో అదరహో అనిపించాడు. 43 అనవసర తప్పిదాలు చేసినా 58 విన్నర్లు కొట్టాడు. ఇదే తరహా ఆటతీరు ఫైనల్లో చూపిస్తే అండర్సన్ టైటిల్ ఎగరేసుకుపోయే అవకాశం లేకపోలేదు.
ఈ సీజన్ ఎంతో అద్భుతంగా సాగింది.
గాయాల కారణంగా కొన్ని సీజన్లకు దూరమయ్యాను. మరో టైటిల్ కోసం ఫైనల్ ఫైట్ చేసే అవకాశం దొరకడం సంతోషంగా ఉంది. - నడాల్
నేడు మహిళల డబుల్స్ ఫైనల్
మహిళల డబుల్స్ ఫైనల్స్ భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 10.30 గంటలకు జరగనున్నది. సానియా (భారత్), పెంగ్ (చైనా) నాల్గో సీడ్ జోడీని సెమీస్‌లో ఓడించిన రెండో సీడ్ జంట మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్), చంగ్ యున్జన్ (తైవాన్)లు..ఫైనల్ పోరులో ఏడో సీడ్ చెక్ రిపబ్లిక్ ద్వయం కాటెరినా సినియకోవా, లూసీ హ్రడెకాలతో తలపడనున్నారు.