Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎస్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత స్టీఫెన్స్
- ఫైనల్లో మడిసన్ కీస్పై సునాయస గెలుపు
- మిక్స్డ్ డబుల్స్ విజేతలు హింగీస్, ముర్రే
- హింగీస్, చన్ జోడీదే మహిళల డబుల్స్
యుఎస్ మహిళల సింగిల్స్‌కు స్లోనె స్టీఫెన్స్ రూపంలో కొత్త చాంపియన్ దొరికింది. ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన యువ కెరటం అబ్బుర పరచింది. ఆల్ అమెరికన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో వీనస్‌ను మట్టికరిపించిన చిచ్చర పిడుగు..ఫైనల్ పోరులో చిననాటి నేస్తం కీస్‌ను చిత్తుగా ఓడించి కెరీర్లో తొలి మేజర్ టైటిల్ ఎగరేసుకుపోయింది. అన్ సీడెడ్‌గా బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న అయిదో అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.
నవతెలంగాణ-న్యూయార్క్
15 ఏండ్ల తర్వాత ఇద్దరు అమెరికా క్రీడాకారిణీలు యుఎస్ ఓపెన్ ఫైనల్లో తలపడ్డారు. 2002లో వీనస్ సోదరీమణులు టైటిల్ సమరం చేయగా విజయం సెరెనాను వరించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఫైనల్లో అమెరికా భామలు మడిసన్ కీస్, స్లోనె స్టీఫెన్స్ లు తలపడ్డారు. కాగా, గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరడం ఇరువురికీ ఇదే తొలిసారి. అయితే, ఇద్దరు యువతుల మధ్య పోరు భారీగా ఉం టుందని భావించినా, 15వ సీడ్ కీస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిం చింది. కానీ అందరి అంచనాలు తల క్రిందుల చేస్తూ 6-3, 6-0తో స్టీఫెన్స్ అలవోకగా కీస్‌ను కంగుతినిపించింది. యుఎస్ మహిళల సింగిల్స్ కొత్త చాంపియన్‌గా అవతరించింది. సెమీ ఫైనల్స్‌లో అమెరికన్ దిగ్గజ క్రీడాకారిణి వీనస్‌ను విలియమ్స్‌ను ఓడించిన స్టీఫెన్స్.. ఫైనల్స్ సైతం నెగ్గి కెరీర్లో తొలి మేజర్ టైటిల్ సొంతం చేసుకున్నది. దాంతో పాటు దాదాపు రూ. 23 కోట్ల ప్రైజ్ మనీ గెల్చుకున్నది. సెమీస్‌లో కొకొ వాండవేగెను సునాయసంగా ఓడించి ఫైనల్స్‌లో అడుగుపెట్టిన కీస్.. టైటిల్ వేటలో స్టీఫెన్స్కు ఏ మాత్రం పోటీనివ్వలేదు. పోరులో ఎదురు లేకపోవడంతో స్టీఫెన్స్ గెలుపు నల్లేరు మీద నడకైంది. కాగా యుఎస్ ఓపెన్ నెగ్గిన రెండో అన్ సీడెడ్ క్రీడాకారిణి స్టీఫెన్స్ కావడం విశేషం.
స్టీఫెన్స్ సింపుల్‌గా.. : టోర్నీ మొత్తంగా చూస్తే స్టీఫెన్స్ సాధించిన విజయాల్లో ఇదే అత్యంత సులువైన విజయం. గంట సేపు
సాగిన రెండు సెట్ల పోరులో 6-3, 6-0తో స్టీఫెన్స్ కీస్‌ను ఓడించింది. తొలి సెట్లో తొలి గేమ్ నెగ్గి కీస్ శుభారంభం చేసింది. రెండో గేమ్ స్టీఫెన్స్ పరం కాగా మూడో గేమ్‌తో కీస్ ఒక గేమ్ ఆధిక్యంలో నిలిచింది. నాల్గో గేమ్ సర్వ్ చేసిన స్టీఫెన్స్ ప్రత్యర్ధికి ఒక్క పాయింట్ ఇవ్వకుండా నెగ్గి 2-2 తో స్కోర్ సమం చేసింది. బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ తప్పిదాలు చేసిన కీస్ 3-6తో సెట్ సమర్పించుకున్నది. ఇక రెండో సెట్ తొలి గేమ్‌లో 40-40 పాయింట్లతో తలపడుతు న్న తరుణంలో వరుసగా కీస్ రెండు అనవసర బ్యాక్ హ్యాండ్ తప్పిదాలు చేసి గేమ్ కోల్పోయింది. కీస్ సర్వీస్ బ్రేక్ చేసి ఫోర్ హ్యాండ్ ద్వారా మరో గేమ్ నెగ్గిన స్టీఫెన్స్ ఆపై వెను దిరిగి చూడలేదు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్‌లు నెగ్గి..6-0తో రెండో సెట్ సహా టైటిల్‌నూ కైవసం చేసుకున్న ది. కీస్ మూడు ఏస్‌లు సంధించి ఒక డబుల్ ఫాల్ట్ చేయగా.. స్టీఫెన్స్ అసలు డబుల్ ఫాల్ట్ చేయనేలేదు. తన ఆటతీరుతో కీస్ 30 అనవసర తప్పిదాలు చేసేలా చేసిన స్టీఫెన్స్ కేవలం ఆరు తప్పిదాలే చేసింది. 21పాయింట్ల ఆధిక్యత ప్రదర్శిం చింది. ఈ విజయంతో స్టీఫెన్స్ 17వ ర్యాంకు, రన్నరప్ కీస్
12వ ర్యాంకు చేరుకుంటారని విశ్లేషకుల అంచనా.
మిక్స్డ్ డబుల్స్ విజేతలు హింగీస్, ముర్రే : టాప్ సీడ్ జోడీ మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్), జేమీ ముర్రే (ఇంగ్లాం డ్)లు యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెల్చుకు న్నారు. ఫైనల్స్‌లో మూడోసీడ్ జంట మైఖెల్ వీనస్ (న్యూజీలాం డ్), చన్ హావ్-చింగ్ (తైవాన్)లను 6-1,4-6, 10-8తో ఓడించారు.
మహిళల డబుల్స్ విజేతలు హింగీస్, చన్ జోడీ : రెండో సీడ్ జోడీ మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్), చన్ యుంగ్-జన్ (తైవాన్).. ఏడో సీడ్ చెక్ రిపబ్లిక్ జంట కటెరినా సిని యకోవా, లూసీ హ్రడేకాలపై 6-3, 6-2తో అలవోకగానెగ్గి యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ అందుకున్నారు.
నేను ఉత్తమ ప్రదర్శన చేయలేదు. నిరాశకు గురయ్యా. నేను అభిమానించే వ్యక్తుల్లో స్లోనె ఒకరు. ఆమె చేతిలో ఓడటం ఆనందమే.
- మడిసన్ కీస్