Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సచిన్ రికార్డులను విరాట్ కోహ్లి బద్దలుకొడతాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సచిన్ రెండు దశాబ్దాల కెరీర్లో 49 వన్డే సెంచరీలు చేయగా, కోహ్లి అప్పుడే 30 బాదేశాడు. 'మరో సచిన్ వస్తాడని ఎన్నడూ అనుకోలేదు. కానీ కోహ్లి నా ఆలోచనను మార్చేశాడు. సచిన్ రికార్డులను కోహ్లి అధిగమిస్తాడని అనుకుంటున్నాను' అని వీరూ అన్నాడు. విరాట్‌కు ఇంకా 28 ఏండ్లే. మరో పదేండ్లు ఆడగలడు. అప్పట్లోగా క్రికెట్లో కోహ్లి మెగా రికార్డులే నెలకొల్పుతాడు, సచిన్‌ను అవలీలగా అధిగమిస్తాడని సెహ్వాగ్ అన్నాడు.