Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5-1తో హోండూరస్పై ఘన విజయం
- ఫిఫా అండర్-17 ప్రపంచకప్
గౌహతి : ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో మూడుకు మూడు విజయాలు సాధించిన ఫ్రాన్స్ అదిరే ఆటతో నాకౌట్లో అడుగు పెట్టింది. గ్రూప్-ఈలో హోండూరస్తో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో చెలరేగిన ఫ్రాన్స్ ఆటగాళ్లు 5-1తో ఏకపక్ష విజయాన్ని అందుకున్నారు. ఆట 14వ నిమిషంలో హోండూరస్ తొలి గోల్‌తో 1-0తో ఆధిక్యం సాధించింది. కానీ ఫ్రాన్స్ వరుసగా 14, 23, 64, 86, 96 నిమిషాల్లో గోల్స్ కొట్టి సత్తా చాటారు. గ్రూప్-ఈలోనే మరో మ్యాచ్‌లో జపాన్‌తో న్యూకొలెడొనియా మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. డ్రా చేసుకున్నా గ్రూప్‌లో రెండో స్థానంతో జపాన్ నాకౌట్‌కు చేరింది. గ్రూప్-ఎఫ్‌లో ఇరాక్‌పై ఇంగ్లాండ్ విరుచుకుపడింది. 4-0తో ఘన విజయం సాధించింది. మెక్సికో, చిలీ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.